News October 31, 2025
2,790 మంది ఇండియన్స్‌ను US తిరిగి పంపింది: కేంద్రం

చట్ట వ్యతిరేకంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన ఇతర దేశస్థులను అమెరికా వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు US నుంచి 2,790 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరంతా అక్కడ చట్టవిరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి నివసించారని పేర్కొన్నారు. అటు 2025లో ఇప్పటివరకు దాదాపు 100 మంది అక్రమవలసదారులను UK తిరిగి పంపిందని తెలిపారు.
Similar News
News October 31, 2025
నెట్‌వర్క్ ఆస్పత్రులకు వన్ టైం సెటిల్మెంట్!

AP: ‘NTR వైద్య సేవ’ కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ASHA ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు 20 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని కోరగా, ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని వారు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.250CR రిలీజ్ చేసి, విడతల వారీగా చెల్లిస్తామన్నా సమ్మె విరమించలేదు. దీంతో వన్‌టైం సెటిల్మెంటే మార్గమని భావిస్తున్నట్లు సమాచారం.
News October 31, 2025
నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన

TG: రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం దాదాపుగా ముగిసినట్లేనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇవాళ మాత్రం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.
News October 31, 2025
పాక్-అఫ్గాన్ మధ్య సీజ్‌ఫైర్

ఇస్తాంబుల్‌లో ఐదు రోజులుగా పాక్-అఫ్గాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి లభించింది. దోహాలో OCT 18-19 మధ్య జరిగిన సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తుర్కియే ప్రకటించింది. తదుపరి చర్చలు నవంబర్ 6న జరగనున్నాయి. ‘పరస్పర గౌరవం, జోక్యం చేసుకోకపోవడం ఆధారంగా పాక్‌తో ఎప్పుడూ తాము సత్సంబంధాలే కోరుకుంటాం’ అని అఫ్గానిస్థాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వ్యాఖ్యానించారు.


