News December 22, 2024

దేశీయ చాయ్‌కి అమెరికా ‘ఆరోగ్య’ గుర్తింపు

image

భార‌తీయులు అమితంగా ఇష్ట‌ప‌డే చాయ్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. దేశీయ తేయాకుగా ప్రసిద్ధి చెందిన కమెల్లియా సైనెన్సిస్‌తో త‌యారు చేసిన టీని ఆరోగ్య‌క‌ర‌మైన పానీయంగా US Food and Drug Administration గుర్తించింది. ఈ నిర్ణయాన్ని నార్త్ ఈస్టర్న్ టీ, ఇండియన్ టీ అసోసియేషన్లు స్వాగతించాయి. అంత‌ర్జాతీయ టీ ప‌రిశ్ర‌మ‌కు ఇదో అద్భుత‌మైన వార్త అని అమెరికా టీ అసోసియేషన్ అధ్యక్షుడు పీటర్ ఎఫ్ గోగ్గి పేర్కొన్నారు.

Similar News

News December 22, 2024

దురుసుగా ప్రవర్తిస్తే బౌన్సర్ల తాట తీస్తాం: సీపీ

image

TG: పబ్లిక్‌తో సెలబ్రిటీల బౌన్సర్లు దురుసుగా ప్రవర్తిస్తే వారి తాట తీస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బౌన్సర్ల విషయంలో సెలబ్రిటీలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ‘ఎక్కడైనా బౌన్సర్లు ఓవరాక్షన్ చేస్తే చర్యలు తప్పవు. జనాలను తోయడం, కొట్టడం, దూషించడం వంటివి చేయకూడదు. ఏజెన్సీలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బౌన్సర్ల నియామకంలో జాగ్రత్త వహించాలి’ అని సీపీ హెచ్చరించారు.

News December 22, 2024

స్మృతి మంధాన మరో ఘనత

image

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించారు. ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచారు. ఈ ఏడాది ఆమె 1,602 పరుగులు చేశారు. ఈ క్రమంలో లారా వాల్వడర్ట్(1,593)ను అధిగమించారు. విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆమె ఈ ఫీట్ సాధించారు. కాగా ఈ మ్యాచులో స్మృతి (91) కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. జేమ్స్ బౌలింగ్‌లో ఆమె వికెట్ల ముందు దొరికిపోయారు.

News December 22, 2024

అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారని బన్నీ మాట్లాడటం సరికాదన్నారు. ఆసుపత్రిలో బాలుడిని పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమని చెప్పారు. మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి? సూపర్ స్టార్ అయితే ఏంటి? అని ప్రశ్నించారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు.