News August 13, 2025
పాక్ F16 జెట్ల నష్టంపై US దాటవేత

Op సిందూర్‌లో F16 జెట్లను పాక్ నష్టపోయిందా అన్న ప్రశ్నను US దాటవేసింది. దీనిని పాక్‌తోనే చర్చించాలంటూ NDTVకి జవాబిచ్చింది. నిజానికి దాయాది దేశంలోని ఈ జెట్ల టెక్నికల్ ఆపరేషన్స్, రిపేర్లన్నీ US కాంట్రాక్టర్లే చూస్తారు. 24/7 వారు నిఘా ఉంచుతారు. వీటిని ఉపయోగించాలన్నా ఒప్పందం ప్రకారం వారి అనుమతి తీసుకోవాలి. 2019లో బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ తర్వాత జెట్స్ సురక్షితంగా ఉన్నాయని ఇదే US చెప్పడం గమనార్హం.
Similar News
News August 13, 2025
విజయవాడలో 39 పునరావాస కేంద్రాల ఏర్పాటు

AP: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయవాడలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కృష్ణానది, బుడమేరు వాగు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని ప్రజలకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.
News August 13, 2025
భారీ వర్షాలు.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి: అనిత

APలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఆదివారం వరకు జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, ప్రజలు అత్యవసరమైతే 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. GNT, NTR, కృష్ణా, బాపట్ల జిల్లా కలెక్టర్లను ఆమె అప్రమత్తం చేశారు.
News August 13, 2025
Asia Cup: వీరిలో చోటు దక్కేదెవరికి?

ఆసియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు BCCI మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లలో ఎవరిని సెలక్ట్ చేయాలో తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ ఉన్నారు. అలాగే వన్ డౌన్‌లో సూర్య, ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఉన్నారు. మరో స్థానం కోసం ఆ నలుగురి మధ్య పోటీ నెలకొంది. ఎవరిని సెలక్ట్ చేయాలో కామెంట్ చేయండి.