News December 19, 2024
TP-Link రౌటర్లపై అమెరికా దర్యాప్తు!

చైనాకు చెందిన రౌటర్ తయారీ సంస్థ TP-Link Technologiesపై US ఫెడరల్ ఏజెన్సీలు దర్యాప్తు జరుపుతున్నట్లు Wall Street జర్నల్ తెలిపింది. TP-Link తయారు చేసే పరికరాలు సైబర్ భద్రతకు ప్రమాదకరం అనే అనుమానంతో విచారణ జరుపుతున్నాయి. అలాగే ఈ సంస్థ అన్యాయమైన ధరల విధానాన్ని అనుసరిస్తోందన్న ఆరోపణలపై న్యాయ శాఖ కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది TP-Link రౌటర్లను US నిషేధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Similar News
News November 6, 2025
ప్రభుత్వ స్కూళ్లలో 2,837 ఉద్యోగాలు!

తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో 2,837 కంప్యూటర్ టీచర్లను (ఐసీటీ ఇన్స్ట్రక్టర్లు) నియమించనున్నారు. విద్యార్థులకు ఐటీలో శిక్షణ ఇవ్వడానికి ఔట్ సోర్సింగ్ విధానంలో టీచర్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. నెలకు గౌరవ వేతనంగా రూ.15వేలు చెల్లించనున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
News November 6, 2025
ఇతిహాసాలు క్విజ్ – 58 సమాధానాలు

1. ధృతరాష్ట్రుడి రథసారథి ‘సంజయుడు’.
2. కంసుడి తండ్రి ‘ఉగ్రసేనుడు’.
3. శశాంకుడు అంటే ‘చంద్రుడు’.
4. విశ్వకర్మ పుత్రిక ‘సంజ్ఞ’.
5. తెలుగు సంవత్సరాలు ‘60’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 6, 2025
ముగిసిన తొలి విడత పోలింగ్

బిహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13శాతం పోలింగ్ నమోదైంది. బెగుసరాయ్‌లో అత్యధికంగా 67.32శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు గానూ ఇవాళ 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 11న మరో విడత పోలింగ్ తర్వాత 14న ఫలితాలు వెలువడతాయి.


