News April 6, 2025

రష్యా పేరెత్తడానికే US భయపడుతోంది: జెలెన్‌స్కీ

image

రష్యా తాజాగా చేసిన దాడుల్లో ఎనిమిది మంది పిల్లలు సహా 14 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఈ విషయాన్ని US ఎంబసీకి తెలియజేస్తే బలహీనమైన ప్రతిస్పందన వచ్చిందన్నారు. ‘అగ్రరాజ్యమైనప్పటికీ ఆశ్చర్యకరంగా వీక్ రియాక్షన్ వచ్చింది. వాళ్లు రష్యన్ పేరు చెప్పడానికీ భయపడుతున్నారు’ అని ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక ఉక్రెయిన్‌కు సాయం నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News April 6, 2025

మోదీ కౌంటర్..సంతకాలైనా తమిళంలో చేయండి

image

వైద్య విద్యను తమిళంలో అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రం నుంచి వచ్చిన వినతి పత్రాలలో సంతకాలు తమిళంలో ఉండవని, కనీసం సంతకాలైనా మాతృభాషలో చేస్తే బాగుంటుందని రాష్ట్ర నాయకులకు సూచించారు. తమిళ భాష, సంస్కృతి అభివృద్ధి కోసం కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. జాతీయ విద్యా విధానం అమలు చేస్తే తమిళ భాషకు అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

News April 6, 2025

ప్రియురాలితో మహిళా క్రికెటర్ పెళ్లి

image

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ యాష్లీ గార్డనర్ తన ప్రియురాలు మోనికా రైట్‌ను వివాహమాడారు. 2021 నుంచి డేటింగ్‌లో ఉన్న వీరు గత ఏడాది ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తాజాగా అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన గార్డనర్.. ‘Mrs & Mrs Gardner’ అంటూ తమ వెడ్డింగ్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆమె ఈ ఏడాది WPLలో గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

News April 6, 2025

BRSతో డీల్.. అందుకే HYD స్థానిక ఎన్నికల్లో బీజేపీ పోటీ: పొన్నం

image

TG: HYD స్థానిక సంస్థల ఎన్నికల్లో BRSతో ఒప్పందంలో భాగంగానే BJP నామినేషన్ దాఖలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ‘ఈ ఎన్నికల్లో 112 ఓట్లు ఉన్నాయి. ఇందులో BJPకి 27, BRSకు 23, MIMకు 49 ఉన్నాయి. మాకు 13 మాత్రమే ఉండటంతో పోటీ చేయలేదు. బలం లేని బీజేపీ ఎలా గెలుస్తుంది? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి BRSకు బినామీగా వ్యవహరిస్తున్నారనే చర్చ ప్రజల్లో ఉంది’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!