News August 26, 2024

నేటి నుంచే యూఎస్ ఓపెన్

image

బిగ్గెస్ట్ టెన్నిస్ టోర్నీల్లో ఒకటైన యూఎస్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. పురుషుల సింగిల్స్‌లో పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ విన్నర్ జకోవిచ్ ఫేవరెట్‌గా ఉండగా అల్కరాజ్, సినర్ వంటి స్టార్లు బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్, స్వైటెక్, సబలెంక బరిలో ఉన్నారు. 25వ టైటిల్‌పై కన్నేసిన జకోవిచ్ ఇది గెలిస్తే అత్యధిక గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనున్నారు.

Similar News

News March 13, 2026

పోక్సో శిక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానం: VZM ఎస్పీ

image

ఆరు నెలల్లో జిల్లాలో నమోదైన 17 పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడినట్లు ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. శిక్షల పరంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. మైనర్ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలు చదువుపై దృష్టి పెట్టాలని, ప్రేమ పేరుతో మోసం చేసే వారి మాటలు నమ్మవద్దని సూచించారు.

News March 13, 2026

వార్ ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

image

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో వంట గ్యాస్‌తో పాటు వంట నూనెల ధరలకూ రెక్కలొచ్చాయి. వివిధ రకాల నూనెల రేట్లు గత వారంతో పోలిస్తే కేజీపై ₹1-4 వరకు పెరిగాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ ₹4, పామ్ ఆయిల్ ₹2.50, గ్రౌండ్‌నట్ ఆయిల్ ₹2, సోయాబీన్, వనస్పతి ఆయిల్ ₹1 చొప్పున పెరిగాయి. దేశంలో ఉపయోగించే వెజిటబుల్ ఆయిల్స్‌లో దాదాపు 90 శాతం అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణం.

News March 13, 2026

సెలవు తేదీ మార్పు

image

AP: పవిత్ర రంజాన్ మాసంలో జరుపుకునే ‘షబే ఖద్ర్’ పండుగ సందర్భంగా ప్రకటించిన ఆప్షనల్ సెలవును ఈ నెల 15 నుంచి 17వ తేదీకి ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు CS సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లో, ముఖ్యంగా బేసి సంఖ్య రోజుల్లో ఈ పండుగ జరుపుకుంటారు. ఖురాన్ అవతరించిన రాత్రిగా దీన్ని భావిస్తారు.