News December 25, 2024
యూనస్‌కు US ఫోన్.. ఎందుకంటే?

మతంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్‌కు అమెరికా సూచించింది. ఈ మేరకు మహ్మద్ యూనస్‌తో US NSA జేక్ సలివాన్ ఫోన్లో మాట్లాడారు. ‘మానవ హక్కుల పరిరక్షణ, గౌరవానికి అంకితమయ్యేందుకు ఇద్దరు నేతలు ఆసక్తి ప్రదర్శించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని నడిపిస్తున్నందుకు యూనస్‌ను జేక్ అభినందించారు. నిలకడ, సౌభాగ్య, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు మద్దతిస్తామన్నారు’ అని వైట్‌హౌస్ తెలిపింది.
Similar News
News November 26, 2025
సిరిసిల్ల: రూప్లానాయక్ తండా సర్పంచ్ ఏకగ్రీవం..?

సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలం రూప్లానాయక్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూక్య జవహర్లాల్ నాయక్‌ను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, పోటీలో ఎవరూ ఉండవద్దని గ్రామస్థులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా భూక్య జవహర్లాల్ నాయక్‌ను గ్రామస్థులు అభినందించారు.
News November 26, 2025
డైరెక్టర్ సంపత్ నంది తండ్రి కన్నుమూత

టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి కిష్టయ్య(73) అనారోగ్యంతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంపత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ‘చిన్నప్పుడు జబ్బు చేస్తే నన్ను భుజంపై 10KM మోసుకెళ్లింది మొన్నే కాదా అనిపిస్తోంది. నీకు నలుగురు పిల్లలున్నారు. వాళ్లకీ బిడ్డలున్నారు. ఏ కడుపునైనా ఎంచుకో. ఏ గడపనైనా పంచుకో. కానీ మళ్లీ రా’ అని రాసుకొచ్చారు.
News November 26, 2025
ఆస్పత్రి నుంచి స్మృతి తండ్రి డిశ్చార్జ్.. పెళ్లిపై ప్రకటన ఉంటుందా?

మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు యాంజియోగ్రఫీ సహా అన్ని టెస్టులు పూర్తయ్యాయని, ఎక్కడా బ్లాక్స్ లేవని వైద్యులు తెలిపారు. మరోవైపు స్మృతి పెళ్లిపై వెలువడుతున్న ఊహాగానాలకు కుటుంబం సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. పలాశ్ ముచ్చల్ వేరే యువతితో చేసిన చాటింగ్ బయటకు రావడంతో పెళ్లి రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం <<18385575>>తెలిసిందే.<<>>


