News November 6, 2024

మరికొన్ని గంటల్లో ముగియనున్న US పోలింగ్

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొంటున్న ఓటర్లు, కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా అన్నిచోట్లా భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు పోలింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచే ఎర్లీ ట్రెండ్స్‌ను బట్టి ప్రెసిడెంట్ ఎవరనేది తేలిపోనుంది.

Similar News

News November 24, 2025

అనకాపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి

image

లోక్ అదాలత్ ద్వారా కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. వచ్చే నెల 13న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లోనూ లోక్ దాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరు పార్టీల వారు రాజీకి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. దీనివలన సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు.

News November 24, 2025

బేబీ కార్న్‌ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

image

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్‌గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.

News November 24, 2025

ధర్మేంద్ర గురించి తెలుసా?

image

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్‌ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్‌గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి లోక్‌‌సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.