News February 28, 2025
నీలమ్ శిండే తండ్రి వీసాపై స్పందించిన అమెరికా

US రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ IND విద్యార్థిని నీలమ్ శిండే తండ్రికి <<15601992>>వీసాపై<<>> అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇవాళ ఆయన వీసా ఇంటర్వ్యూకు అవకాశం కల్పించింది. కాలిఫోర్నియా వర్సిటీలో PG చేస్తున్న నీలమ్‌ను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఆమె తండ్రి వీసాకు అప్లై చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని NCP MP సుప్రియ కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా విదేశాంగ శాఖ USతో చర్చించింది.
Similar News
News November 11, 2025
వంటింటి చిట్కాలు

* రాగి, అల్యూమినియం పాత్రలను తోమేటప్పుడు సబ్బులో కాస్త వెనిగర్ కలిపితే కొత్తవాటిలా మెరుస్తాయి.
* దొండకాయలు, బెండకాయలు కోసేటప్పుడు చేతులకు నిమ్మరసం రాసుకుంటే వాటి జిగురు చేతులకు అంటుకోకుండా ఉంటుంది.
* కొత్తిమీర కాడల్ని కత్తిరించి నాలుగైదు వరుసల్లో కాగితాలు చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టండి.
News November 11, 2025
ఢిల్లీలో ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు!

ఢిల్లీ ప్రజలు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న ఓ యువకుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ నిద్రలోనే చనిపోయాడు. దీనిపై ఓ తెలుగు వైద్యురాలు స్పందిస్తూ.. ‘ఢిల్లీ నుంచి వచ్చిన పిల్లలు శ్వాస ఇబ్బందులు అని చెబుతున్నారు. మొదట్లో షాక్ అయ్యా. NOV-DECలో ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఢిల్లీ వెళ్లారా అని అడిగితే అవునంటున్నారు’ అని Xలో రాసుకొచ్చారు.
News November 11, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* విశాఖ, తిరుపతి, అమరావతిలను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తాం. రాయలసీమలో ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ , డ్రోన్ సిటీలతో పాటు ఆటోమొబైల్ కారిడార్లు, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం: మంత్రి నిమ్మల రామానాయుడు
* కర్నూలు(D) బ్రాహ్మణపల్లిలో రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌కు శంకుస్థాపన జరిగింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బేవరేజస్ ప్లాంట్: మంత్రి టీజీ భరత్


