News October 31, 2024
12 భారతీయ సంస్థలు, ఇద్దరు పౌరులపై అమెరికా ఆంక్షలు
ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై 12కిపైగా భారతీయ కంపెనీలు, ఇద్దరు పౌరులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో 400+ సంస్థలు, వ్యక్తులు ఉన్నారు. వీరు యుద్ధానికి అవసరమైన పరికరాలను రష్యాకు సరఫరా చేస్తున్నట్టు అమెరికా ఆరోపించింది. సిక్కు వేర్పాటువాది పన్నూ హత్య కుట్రలో భారత మాజీ గూఢచారి ప్రమేయంపై అమెరికా అభియోగాలు మోపిన అనంతరం తాజా ఆంక్షలు చర్చకు దారి తీశాయి.
Similar News
News November 1, 2024
బాబు వచ్చాడు.. ప్రజల భవిష్యత్తు అంధకారం: VSR
AP: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల ధరలు కొండెక్కాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయింది. పేద మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నా CBN పట్టించుకోవట్లేదు. మరోవైపు సామాన్యుడిపై విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ నినాదం ఇప్పుడు బాబు వచ్చాడు-భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది’ అని Xలో ఫైరయ్యారు.
News November 1, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: నవంబర్ 1, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:15 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:44 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 1, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.