News October 23, 2025

రష్యా ప్రధాన ఆయిల్ కంపెనీలపై యూఎస్ ఆంక్షలు

image

రష్యా ప్రధాన ఆయిల్ కంపెనీలైన రాస్‌నెఫ్ట్, లూకోయల్‌పై యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో ఆ సంస్థలతో యూఎస్ వ్యక్తులు, సంస్థలు ఎలాంటి వాణిజ్యం చేయకుండా నిషేధం అమలులో ఉండనుంది. ఈ చర్యలు రష్యా శక్తి వనరులపై ఒత్తిడిని పెంచి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనం చేస్తాయని పేర్కొన్నారు. శాంతికి తామే మొగ్గుచూపుతామని, ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించాలని రష్యాను కోరారు.

Similar News

News October 23, 2025

అభ్యంగన స్నానం వెనుక ఆంతర్యమిదే!

image

శరీరాద్యంతము తైలమును అంటుకోవడమే అభ్యంగనం. అనగా ఆముదము గానీ, నువ్వుల నూనె గానీ, నెయ్యి, వెన్న మొదలైన ఏదో ఒక తైలమును శరీరమంతా బాగా పట్టించి కనీసం 30 నిమిషాల తర్వాత శీకాయపొడి కానీ, పెసరపిండి కానీ, శనగపిండి గానీ ఉపయోగించి గోరువెచ్చటి నీటితో స్నానము చేయాలి. ఇది ఆధ్యాత్మిక నియమమే కాదు. ఆరోగ్యకరం కూడా! అందుకే పండుగల్లో దీన్ని విధిగా ఆచరించాలని మన పెద్దలు సూచిస్తుంటారు. కార్తీక మాసంలో ఈ నియమం ముఖ్యం.

News October 23, 2025

ఇంటి చిట్కాలు

image

* చెత్తబుట్టలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. బుట్ట అడుగు భాగంలో కొంచెం బొరాక్స్‌ పొడి చల్లాలి.
* కాస్త వెనిగర్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి డైనింగ్ టేబుల్ తుడిస్తే ఎలాంటి మరకలైనా పోతాయి.
* ట్యాపులపై ఉండే మచ్చలు పోయి కొత్తవాటిలా మెరవాలంటే వారానికోసారి నిమ్మకాయ ముక్కతో రుద్దాలి.
* కొవ్వొత్తులను వెలిగించే ముందు వాటి పైభాగాన కాస్త ఉప్పు రాస్తే ఎక్కువ సమయం వెలుగుతాయి.

News October 23, 2025

ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలివిగో!

image

సాధారణంగా వేధించే ఆరోగ్య సమస్యలకు తగిన విటమిన్లు, ఖనిజాలు తీసుకోవడం ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. జుట్టు రాలకుండా ఉండేందుకు బయోటిన్ (B7)& A, E, అలసటకు విటమిన్ B12& D& ఐరన్, మొటిమలకు విటమిన్ A& జింక్, పొడి చర్మానికి విటమిన్ C & E, ఒమేగా-3 వంటివి ప్రయోజనకరం. తలనొప్పికి మెగ్నీషియం & B2, వీక్‌నెస్‌కి B1& D & మెగ్నీషియం ఆహారంలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. SHARE IT