News February 4, 2025
అక్రమ వలసదారులను తరలించేందుకు యూఎస్ భారీ ఖర్చు

తమ దేశంలోని అక్రమ వలసదారులను తరలించేందుకు అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. ఒక్కొక్కరిపై దాదాపు 4,675 డాలర్లు (రూ.4 లక్షలు) ఖర్చు చేస్తున్నట్లు అంచనా. మామూలు విమానాల్లో టికెట్ ధర 853 డాలర్లు ఉండగా, ఇందుకు 5 రెట్లు వెచ్చిస్తోంది. వలసదారులందరినీ సీ-17, సీ-130ఈ మిలటరీ విమానాల్లోనే వారి దేశాలకు తరలిస్తోంది. ఈ విమానాల నిర్వహణకు గంటకు దాదాపు రూ.2 కోట్ల నుంచి రూ.7.50 కోట్లు ఖర్చు అవుతుందని సమాచారం.
Similar News
News April 2, 2026
రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన!

AP: రాష్ట్రంలోని గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి రానుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం 20రోజుల కిందటే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీ కాలం మొన్నటితో ముగిసింది. దీంతో కొత్త SEC వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
News April 2, 2026
KKRvsSRH: ఓటమి కసితో బరిలోకి!

IPL: కోల్‌కతా వేదికగా ఇవాళ KKR, SRH మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచుల్లో ఇరుజట్లు ఓటమి చెందాయి. దీంతో ఇవాళ గెలిచి బోణీ కొట్టాలని కసితో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్‌లు 30 సార్లు తలపడగా KKR 20 సార్లు విజయం సాధించింది. కోల్‌కతాలో అయితే 11 సార్లు పోటీపడగా 8 గెలుపులతో KKRదే పైచేయిగా ఉంది. బ్యాటింగ్‌లో ఇరుజట్లు బలంగానే ఉన్నా బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనత కన్పిస్తోంది.
News April 2, 2026
ఇలాంటి కొడుకు బతికున్నా ప్రయోజనం లేదు!

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తల్లిదండ్రుల మీద దయ, ప్రేమలేని కుమారుడు పుట్టినా, చచ్చినా ఒక్కటే. ఎవరికీ ఉపయోగం ఉండదు. పుట్టలో చెదలు నిరంతరం పుడుతూ, చస్తూ ఉంటాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. తల్లిదండ్రులకు సేవ చేయని కొడుకు కూడా ఆ చెదలతో సమానమే. <<-se>>#PADHYAM<<>>


