News July 25, 2024

హమాస్‌పై యుద్ధానికి US సపోర్ట్ కావాలి: ఇజ్రాయెల్ PM

image

గాజాతో యుద్ధంలో పూర్తి విజయాన్ని సాధించేవరకూ పోరాటం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. హమాస్‌తో పాటు ఇరాన్ మద్దతున్న గ్రూపులతో పోరాడేందుకు తమకు యూఎస్ సపోర్ట్ కావాలన్నారు. US, ఇజ్రాయెల్ కలిసి పని చేస్తే వారిని ఓడించవచ్చని అన్నారు. ‘మా యుద్ధం మీ యుద్ధమే. మా శత్రువులూ మీకు శత్రువులే. మా విజయం మీకూ విజయమే’ అని యూఎస్ కాంగ్రెస్‌లో వ్యాఖ్యానించారు.

Similar News

News March 31, 2026

యుద్ధం.. భారీగా పెరగనున్న ధరలు

image

పశ్చిమాసియా యుద్ధం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపించనుంది. AP, TGలో సిమెంట్ బస్తా ధర రూ.50 పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. వారంలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో బస్తా రూ.280-320 మధ్య ఉండగా పెంపు తర్వాత రూ.320-370కి చేరనుంది. సిమెంట్ కంపెనీలు వాడే పెట్రోలియం కోక్ 130 డాలర్ల నుంచి 165కు చేరడం, ఇండస్ట్రియల్ డీజిల్ రేట్‌ రూ.23.75 పెంచడం ధరల పెరుగుదలకు కారణం.

News March 31, 2026

ఎలాంటి భోజనం తృప్తినిస్తుంది?

image

గంగిగోవు పాలు గరిటెడైనా చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గాడిద పాలు కడవ నిండా ఉన్నా గరిటెడు ఆవు పాలతో సమానం కాదు. అలాగే ప్రేమ, భక్తితో పెట్టిన కొద్ది భోజనమైనా ఎంతో తృప్తిని ఇస్తుందని అర్థం.
<<-se>>#PADHYAM<<>>

News March 31, 2026

భారత్ తొలి మహిళా డాక్టర్.. ఎందరికో స్ఫూర్తి!

image

పాశ్చాత్య వైద్యశాస్త్రంలో పట్టాపొందిన తొలి భారతీయ మహిళ డాక్టర్.ఆనందీబాయి జోషి. 1865 MAR 31న మహారాష్ట్రలో జన్మించిన ఈమెకు తొమ్మిదేళ్లకే వివాహమైంది. 14ఏళ్ల వయసులో కొడుకు పుట్టగా సరైన వైద్య సౌకర్యాలు లేక పది రోజులకే చనిపోయాడు. మహిళా డాక్టర్ల అవసరాన్ని గ్రహించిన ఆమె మెడిసిన్ చదివేందుకు సిద్ధపడ్డారు. భర్త ప్రోత్సాహంతో సమాజాన్ని ఎదిరించి అమెరికా వెళ్లారు. 1886లో పట్టా పొంది భారత్ తిరిగొచ్చారు.