News August 28, 2025

యూఎస్ టారిఫ్స్ భారత్‌కు మేల్కొలుపు: రఘురామ్ రాజన్

image

యూఎస్ టారిఫ్స్ భారత్‌కు మేల్కొలుపు వంటిదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఫైనాన్స్ అనేవి ఇప్పుడు ఆయుధాలుగా మారుతున్నాయని ఇండియా టుడేతో చెప్పారు. అంతర్జాతీయంగా భారత్ ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. యువతకు ఉపాధిని కల్పించేందుకు, అవసరమైన వృద్ధి రేటు 8-8.5% సాధించడంలో సంస్కరణలను ఆవిష్కరించాలన్నారు.

Similar News

News August 28, 2025

మరో 6 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

TGలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో 6 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నల్గొండ, యాదాద్రి, KNR, ఖమ్మం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. <<17538468>>ఇప్పటికే<<>> కామారెడ్డి, MDK, నిర్మల్, ADB, ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇవాళ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది.

News August 28, 2025

కామారెడ్డిలో మళ్లీ మొదలైన వర్షం

image

TG: కామారెడ్డిలో తెల్లవారుజాము నుంచే ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. GRకాలనీ, అశోక్ నగర్, కాకతీయ, గోసంగి, ఇందిరానగర్ కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

News August 28, 2025

నేటి నుంచి విశాఖలో జనసేన సమావేశాలు

image

AP: ఇవాళ్టి నుంచి విశాఖలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ‘సేనతో సేనాని’ ప్రారంభంకానుంది. మూడ్రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇవాళ పార్టీ ఎంపీలు, MLAలు, MLCలతో పవన్ భేటీ అవుతారు. రేపు 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి వచ్చే క్రియాశీలక కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ ఉంటుంది. 30వ తేదీన అల్లూరి సీతారామరాజు ప్రాంగణం(ఇందిరా గాంధీ స్టేడియం) నుంచి పవన్ ప్రసంగిస్తారు.