News April 11, 2025
చైనాపై 145శాతానికి చేరిన అమెరికా సుంకాలు

చైనాపై అమెరికా విధించిన మొత్తం సుంకాలు 145 శాతానికి చేరాయి. వాస్తవంగా టారిఫ్‌ల పర్సంటేజీ 125 శాతానికి చేరింది. అయితే గతంలో ఫెంటానిల్ అక్రమ రవాణా కాకుండా విధించిన 20 శాతాన్ని అమెరికా తాజాగా గుర్తుచేసింది. దానితో కలిపి మొత్తం టారిఫ్‌లు 145శాతానికి చేరుకున్నాయని ట్రంప్ యంత్రాంగం వివరించింది. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84శాతం సుంకాల్ని విధించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 15, 2025
కలెక్టర్ల కాన్ఫరెన్స్.. చర్చించే అంశాలు ఇవే

AP: ఇవాళ, రేపు సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఇవాళ ఉ.10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, హౌసింగ్, సూపర్ సిక్స్ పథకాలు, పీ-4, అన్న క్యాంటీన్లు, సాగునీటి ప్రాజెక్టులు, హైవేలు, పోర్టుల పురోగతిపై చర్చించనున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు విద్య, వైద్యం, రెవెన్యూ తదితర అంశాలపై చర్చ జరగనుంది.
News September 15, 2025
ఏపీ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు

APPSC 10 తానేదార్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 1వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 330. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/
News September 15, 2025
‘మిరాయ్’లో రాముడి రోల్ చేసింది ఎవరంటే?

‘మిరాయ్’లో రాముడి పాత్ర AIతో రూపొందించలేదని సినీ వర్గాలు తెలిపాయి. ఈ క్యారెక్టర్‌లో బాలీవుడ్ నటుడు గౌరవ్ బోరా కనిపించారని పేర్కొన్నాయి. హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ చేసిన డెహ్రడూన్‌కు చెందిన ఈ యాక్టర్ పలు కమర్షియల్ యాడ్స్‌లోనూ కనిపించారు. అయితే మూవీలో ఫేస్‌ను రివీల్ చేయకుండా డైరెక్టర్ కార్తీక్ జాగ్రత్తపడ్డారు. అంతకుముందు ఈ రోల్ <<17686798>>ప్రభాస్<<>> కనిపించారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.