News December 14, 2024

అత్యధిక భారతీయులున్న దేశాల్లో US టాప్!

image

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఇండియా నుంచి ఇతర దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. దీంతో విదేశాల్లో భారతీయుల సంఖ్య పెరుగుతోంది. అత్యధిక భారతీయ జనాభా కలిగిన దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. USలో 54,09,062 మంది భారతీయులు ఉన్నారు. UAEలో 35,68,848, మలేషియాలో 29,14,127, కెనడాలో 28,75,954, సౌదీ అరేబియాలో 24,63,509, మయన్మార్‌లో 20,02,660, UKలో 18,64,318, దక్షిణాఫ్రికాలో 17,00,000 మంది ఉన్నారు.

Similar News

News December 5, 2025

ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

image

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్స్ ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో ఉండే బిస్పినాల్‌ ఏ (BPA) రసాయనం ఈస్ట్రోజన్‌, టెస్టోస్టిరాన్‌ సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS సమస్యలు, టైప్‌ 2 డయాబెటిస్‌, నాడీ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News December 5, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన సిల్వర్ రేటు!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా.. సిల్వర్ రేటు భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి రూ.1,29,930కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 ఎగబాకి రూ.1,19,100 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 తగ్గి రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 5, 2025

షమీని ఎందుకు ఆడించట్లేదు: హర్భజన్

image

డొమెస్టిక్ క్రికెట్‌లో రాణిస్తున్నా షమీని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవట్లేదని సెలక్టర్లను మాజీ క్రికెటర్ హర్భజన్ ప్రశ్నించారు. మంచి బౌలర్లను సైడ్‌లైన్ చేసేస్తున్నారని అన్నారు. ‘ప్రసిద్ధ్ మంచి బౌలరే కానీ అతడు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వైట్‌బాల్ క్రికెట్‌లో మ్యాచులు గెలిపించే బౌలర్లు ప్రస్తుత టీమ్‌లో లేరు’ అని పేర్కొన్నారు. నిన్న SMATలో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచులో షమీ 4 వికెట్లు పడగొట్టారు.