News January 23, 2025

భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలకు USA ప్రాధాన్యం: జైశంకర్

image

భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలకు అమెరికా ప్రాధాన్యం ఇస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోతో భేటీ అయిన జైశంకర్ మాట్లాడారు. ద్వైపాక్షిక ఒప్పందాలతో పాటు భారత్‌తో బంధాన్ని బలపరుచుకోవడానికి USA ఇష్టపడుతోందని తన పర్యటనలో అర్థమైందన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరఫున జైశంకర్ హాజరయ్యారు.

Similar News

News December 6, 2025

సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు ఇవ్వండి: మంత్రి అచ్చెన్నాయుడు

image

దేశ రక్షణలో అమరులైన, విధీ నిర్వహణలో గాయపడిన మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ప్రతి ఒక్కరు ఉదారంగా విరాళాలు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో ఆయన ముందుగా విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్, రవికుమార్, కలెక్టర్ పాల్గొన్నారు.

News December 6, 2025

గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

image

AP: విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తోన్న కృషిని CM వివరించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణ పనుల పురోగతిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

News December 6, 2025

హిట్ మ్యాన్@ 20,000 రన్స్

image

SAతో మూడో వన్డేలో రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌(టెస్టు, వన్డే, T20)లో 20,000 పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. కేశవ్ వేసిన 14 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనత సాధించారు. సచిన్(34,357), కోహ్లీ(27,910), ద్రవిడ్(24,064) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుత మ్యాచ్‌లో భారత్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో జైస్వాల్(38), రోహిత్(50) ఉన్నారు.