News May 3, 2024

USA WC జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు

image

T20 WC కోసం ప్రకటించిన USA జట్టులో భారత సంతతికి చెందిన మోనాంక్ పటేల్(C), సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్ చోటు సంపాదించారు. మిగతా ప్లేయర్లలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరే అండర్సన్, ఆరోన్ జోన్స్(VC), S టేలర్, జెస్సీ సింగ్, కెంజిగే, షాల్క్‌విక్, ఆండ్రీస్ గౌస్, జహంగీర్, అలీఖాన్, నితీశ్ కుమార్ ఉన్నారు. రిజర్వ్ ప్లేయర్లుగా గజానంద్, డ్రైస్‌డేల్, యాసిర్ ఎంపికయ్యారు.

Similar News

News December 29, 2025

క్యాబినెట్ సమావేశం ప్రారంభం..

image

AP: సీఎం CBN అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 20 అజెండాలపై చర్చించనుంది.
*అమరావతి అభివృద్ధికి నాబార్డు నుంచి రూ.7,387 కోట్ల రుణాలు
*అటవీశాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీ
*ఉద్యోగుల డీఏ పెంపు అమలుకు ఆర్థికశాఖ అనుమతికి ఆమోదం
*గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్
*జిల్లా కోర్టుల్లో సిస్టమ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ల పోస్టులు

News December 29, 2025

ఈ మెడిసిన్ కొంటున్నారా?

image

అనారోగ్యానికి గురైన సమయంలో తీసుకునే కొన్ని ట్యాబ్లెట్స్ స్ట్రిప్స్‌పై ఉండే ఎర్రటి గీతను ఎప్పుడైనా గమనించారా? రెడ్‌లైన్ ఉంటే వైద్యుడి సలహా లేకుండా వినియోగించకూడదని కేంద్రం చెబుతోంది. యాంటీబయాటిక్స్ ఇష్టారీతిన తీసుకోవడం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌‌కు దారితీస్తుందని హెచ్చరించింది. ఇలాంటి విషయాల్లో బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. మెడిసిన్ కొనే సమయంలో గడువు తేదీతో పాటు రెడ్ లైన్‌ను గమనించండి.

News December 29, 2025

రాష్ట్రంలో 66 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>తెలంగాణ <<>>రాష్ట్రంలో 66 సివిల్ జడ్జీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. LLB ఉత్తీర్ణతతో పాటు బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 23- 35ఏళ్ల మధ్య ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా వోస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్(CBT) FEBలో నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.1250, EWS, PwBD, SC, STలకు రూ.600. వెబ్‌సైట్: tshc.gov.in