News January 22, 2025
USA ఊహించినంత ప్రయోజనం ఉండదు: రఘురామ్ రాజన్

దిగుమతి సుంకాలు పెంచాలనే USA అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన ప్రపంచ ఆర్థిక అసమానతలకు కారణమవుతుందని RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. విదేశాల్లో వస్తువులు చౌకగా ఉన్నందున వాటిని దిగుమతి చేసుకునేటప్పుడు సుంకాలు పెంచి ప్రయోజనాలను పొందాలని USA చూస్తున్నట్లు తెలిపారు. దీంతో విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. సుంకాలపై అమెరికా ఊహించినంత ప్రయోజనకరంగా ఉండదన్నారు.
Similar News
News November 21, 2025
TG వెదర్ అప్డేట్.. ఈనెల 23 నుంచి వర్షాలు

TG: రాష్ట్రంలో ఈనెల 23 నుంచి 25 వరకు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు పొడి వాతావరణం నెలకొంటుందని, రాబోయే 2 రోజుల్లో పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉంటాయని వెల్లడించింది. నేడు ADB, JGL, KMR, ASF, MNCL, MDK, NML, NZB, SRCL, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11-15°C ఉంటాయని, మిగతా జిల్లాల్లో >15°Cగా నమోదవుతాయని తెలిపింది.
News November 21, 2025
ఆ గొడ్డు మంచిదైతే ఆ ఊళ్లోనే అమ్ముడుపోను

కొంతమంది సొంతూరిలో తమకు సరైన అవకాశాలు లేవని చెప్పుకుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అయితే అతనిలో సత్తా ఉంటే సొంత ప్రాంతంలోనే పని లభించేదని ఈ సామెత అర్థం. అయితే ప్రతిభ అనేది ఒకరు ఆపితే ఆగేది కాదని చెప్పే పెద్దలు ఈ జాతీయాన్ని ఉదహరిస్తూ వేరొక చోట ప్రయత్నాలు చేసేవారిని గురించి విమర్శిస్తూ మాట్లాడేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు.
News November 21, 2025
దేవుడు ఎంత గొప్పవాడంటే ?

యత స్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే|
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే||
సృష్టి ఆరంభంలో సమస్త ప్రాణులు దేని నుంచి ఉద్భవిస్తాయో, తిరిగి యుగం ముగిసే సమయంలో దేనిలో లయమైపోతాయో.. ఆ పరమ పవిత్ర పదార్థమే పరమాత్ముడు. ఆయన ఈ జగత్తును నడిపిస్తాడు. నిరంతరం జరిగే సృష్టి-లయ చక్రంలో ఆయనే ముఖ్యపాత్రుడు. అలాంటి భగవంతుడికి మన కోర్కెలు తీర్చడం పెద్ద విషయం కాదు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


