News May 30, 2024
86.5%కి పెరిగిన ₹500 నోట్ల వాడకం
₹2వేల నోట్ల ఉపసంహరణ ప్రభావంతో ₹500 నోట్ల వాడకం 86.5%కి చేరిందని ఆర్బీఐ వెల్లడించింది. గత ఏడాది ఇది 77.1%గా ఉండగా.. మే 2023లో ₹2వేల నోట్ల ఉపసంహరణ ప్రకటనతో అమాంతం పెరిగిందని తెలిపింది. 2024 మార్చి 31కి వాడుకలో ₹500(5.16 లక్షల నోట్లు)టాప్ ప్లేస్‌లో ఉండగా.. ₹10 నోట్లు(2.49 లక్షల నోట్లు) రెండో స్థానంలో ఉన్నట్లు వివరించింది.
Similar News
News January 20, 2025
బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష
కేరళలో ప్రియుడిని హత్య చేసిన గ్రీష్మకు నెయ్యట్టింకర కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఆమెకు సహకరించిన మామకు 3సం. జైలుశిక్ష పడింది. తనతో రిలేషన్ ముగించేందుకు శరణ్(23) ఒప్పుకోలేదని పెస్టిసైడ్ కలిపిన డ్రింక్ తాగించి చంపేసింది. గ్రీష్మ వయసు (2022లో 22సం.) దృష్ట్యా శిక్ష తగ్గించాలన్న లాయర్‌కు.. క్రూర నేరం, సాక్ష్యాలు చెరిపేసి, దర్యాప్తు తప్పుదోవ పట్టించిన ఆమె వయసును పరిగణించలేమని జడ్జి చెప్పారు.
News January 20, 2025
RGKar Verdict: వాదనలు ప్రారంభం
<<15186542>>కోల్‌కతా<<>> హత్యాచార దోషి సంజయ్‌కు శిక్ష ఖరారుపై కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేసిన CBI దోషికి ఉరి శిక్ష విధించాలని వాదిస్తోంది. అత్యంత క్రూర నేరానికి పాల్పడ్డ వ్యక్తికి ఇదే సరైన శిక్ష అని సీఎం మమతా బెనర్జీ సైతం కాసేపటి క్రితం కామెంట్ చేశారు. కాగా డిఫెన్స్ లాయర్ ఏం వాదించనున్నారో తెలియాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం 2గం. తర్వాత తీర్పు వచ్చే అవకాశముంది.
News January 20, 2025
లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి?.. హోంమంత్రి ఏమన్నారంటే?
AP: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న ప్రచారంపై హోంమంత్రి అనిత స్పందించారు. ‘అంతా దైవేచ్ఛ. నుదుటిపై రాసి ఉన్నది ఎవరూ తీయలేరు. లోకేశ్‌కు రాసిపెట్టి ఉందేమో చూద్దాం’ అని అన్నారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని పలువురు టీడీపీ నేతలతో పాటు అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే.