News October 8, 2025
జీవ ఎరువుల వాడకం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రైతు వాడే <<17939337>>జీవ ఎరువు<<>> ఆ పంటకు సరైనదై ఉండాలి. ఈ ఎరువు ప్యాకెట్లను నీడ ప్రదేశంలోనే నిల్వచేయాలి. ప్యాకెట్‌పై పేర్కొన్న గడువు తేదీలోపే వాడుకోవాలి. రసాయన ఎరువులతో కలిపి జీవ ఎరువులు వాడరాదు. పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే వీటిని వాడుకోవాలి. సేంద్రియ ఎరువుతో జీవ ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవాలి. ఈ ఎరువులను తొలిసారి వినియోగిస్తుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకే వినియోగించాలి.
Similar News
News March 11, 2026
స్టాక్ మార్కెట్లు క్రాష్

యుద్ధం ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఫ్లాట్‌గా స్టార్ట్ అయిన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,342 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు కోల్పోయాయి. సన్ ఫార్మా, ఎన్టీపీసీ మినహా అన్ని కంపెనీల షేర్లు ఘోర నష్టాలు చవిచూశాయి. FII అమ్మకాలు, ప్రాఫిట్ బుకింగ్, ఇరాన్‌పై దాడులు కొనసాగుతుండడం మార్కెట్లపై ప్రభావం చూపించింది.
News March 11, 2026
యూజర్లకు షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్?

మొబైల్ డేటాపై ట్యాక్స్ విధించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధ్యయనం చేయాలని టెలికం విభాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇది ఆదాయం పెంచడంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు దోహదం చేస్తుందని ఆలోచిస్తుందట. ఒక GB డేటాపై ₹1 ట్యాక్స్ వేసినా ఏటా ₹22,900 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
News March 11, 2026
రాష్ట్రంలో మూడో డిస్కం

TG: రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటైంది. దీనికి తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TGRPDCL)గా పేరు పెడుతూ ప్రభుత్వం GO జారీ చేసింది. CMDగా ముషారఫ్ అలీ ఫరూఖీని, మరో నలుగురు డైరెక్టర్లను నియమించింది. వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, వాటర్ సప్లై స్కీమ్/మిషన్ భగీరథ, HMWSSB, మున్సిపల్ వాటర్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించనుంది. కొత్త వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వనుంది.


