News March 15, 2025

బస్సులు, మెట్రో వినియోగం పెరగాలి: CM రేవంత్

image

TG: హైదరాబాద్‌లో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరుగుతోందని CM రేవంత్ అన్నారు. ‘నగరంలో రోజుకు 1,600 వాహనాలు కొత్తగా రోడ్ల మీదకు వస్తున్నాయి. వాటి రిజిస్ట్రేషన్లతో ఆదాయం వస్తున్నా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. HYDలో ఒక వ్యక్తి వెళ్లినా ప్రత్యేకంగా కారులోనే వెళ్తున్నారు. బస్సులు, మెట్రోను ఉపయోగించుకునే వారి సంఖ్య పెరగాలి. దిల్లీలో కాలుష్యం పెరిగి విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసివేశారు’ అని గుర్తుచేశారు.

Similar News

News February 13, 2026

ఫిబ్రవరి 13: చరిత్రలో ఈరోజు

image

1879: స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జననం (ఫొటోలో)
1913: పండితుడు, రచయిత గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం
1930: సినీ గేయ రచయిత దాసం గోపాలకృష్ణ జననం
2014: ఛాయాగ్రాహకుడు, దర్శకుడు బాలు మహేంద్ర మరణం
2015: తెలుగు నవలా రచయిత పి.కేశవ రెడ్డి మరణం
☛ ప్రపంచ రేడియో దినోత్సవం

News February 13, 2026

టీమ్ ఇండియాకు అతిపెద్ద విజయం

image

నమీబియాతో మ్యాచులో 93 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమ్ ఇండియా సరికొత్త రికార్డు నమోదు చేసింది. T20 WCలో పరుగులు పరంగా మెన్ ఇన్ బ్లూకు ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2012లో ఇంగ్లండ్‌పై 90, 2014లో ఆస్ట్రేలియాపై 73, 2022లో జింబాబ్వేపై 71 రన్స్ తేడాతో గెలిచింది. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుస విజయాల సంఖ్య 10కి చేరింది. గత మ్యాచులో సౌతాఫ్రికా(8) రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.

News February 13, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.