News November 18, 2024
బల్బ్ లేకముందు 12 గంటలు నిద్రపోయేవారు!

ఇప్పుడంటే లైట్స్, కరెంట్ అందుబాటులో ఉండటంతో అర్ధరాత్రి వరకూ నిద్రపోకుండా ఉంటున్నాం. ఎడిసన్ బల్బును కనుగొనక ముందు ఎలా ఉండేదో తెలుసా? 20వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రతి ఒక్కరూ దాదాపు 10 నుంచి 12 గంటల వరకు నిద్రపోయేవారని నిపుణులు చెబుతున్నారు. ఇది వేసవిలో కాస్త తగ్గేదని అంటున్నారు. ప్రస్తుతం కృత్రిమ కాంతి వల్ల నిద్ర గురించి పూర్తిగా పట్టించుకోవట్లేదని గుర్తుచేస్తున్నారు.
Similar News
News October 22, 2025
ఆస్తులు పెరిగాయి కానీ.. ఉపాధి తగ్గింది

తయారీ రంగంపై ASI ఆసక్తికర అంశాలు వెల్లడించింది. FY24లో మిషనరీ, ల్యాండ్ ఇతర కేపిటల్ వ్యయం 12.6% పెరగ్గా ఉపాధి 7.8%కే పరిమితమైంది. పెరిగిన పోటీ, ఆధునిక సాంకేతికతతో యంత్రాలపై పెట్టుబడి పెరిగినట్లు పేర్కొంది. యంత్ర పరిశ్రమలో 12.9% ఉద్యోగాలు పెరగ్గా 29.7% పెట్టుబడి ఉన్న వస్త్రరంగంలో తగినంత ఉద్యోగ కల్పన కనిపించలేదంది. టెక్నాలజీ అభివృద్ధితో వీటి నిష్పత్తిలో వ్యత్యాసం తప్పదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
News October 22, 2025
బిట్స్ పిలానీలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ ఇన్స్ట్రక్టర్/ విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్తో పాటు పని అనుభవంగల అభ్యర్థులు నవంబర్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.bits-pilani.ac.in/
News October 22, 2025
బకాయిలు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తారా.. ప్రభుత్వంపై బండి ఫైర్

TG: ఫీజు బకాయిలు అడిగిన విద్యాసంస్థలను విజిలెన్స్ దాడులతో బ్లాక్మెయిల్ చేస్తారా అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బిహార్ ఎన్నికలకు ఇక్కడి నుంచి డబ్బులు పంపే సర్కార్.. విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేదా అని ప్రశ్నించారు. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడొద్దని, అండగా ఉంటామని విద్యాసంస్థలకు భరోసా ఇచ్చారు.