News October 25, 2024

BSNLకే యూజర్ల ఓటు

image

ప్రైవేటు టెలికం కంపెనీల ఛార్జీల పెంపుతో BSNLవైపు యూజర్లు మొగ్గు చూపుతున్నారు. జులైలో 29.3లక్షల మంది BSNLలో చేరగా ఆగస్టులో 25.3 లక్షల మంది ఈ నెట్‌వర్క్‌ను ఎంచుకున్నట్లు ట్రాయ్ తెలిపింది. అటు JIO 40.2లక్షలు, Airtel 24.1లక్షలు, Vi 18.7లక్షల మంది సబ్ స్క్రైబర్లను కోల్పోయినట్లు వెల్లడించింది. ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే BSNL టారిఫ్ పెంచబోమని పేర్కొనడంతో యూజర్లు ఆవైపుగా మొగ్గు చూపుతున్నారని సమాచారం.

Similar News

News December 3, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 3, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 3, 2025

Dream 11 సెకండ్ ఇన్నింగ్స్: హర్ష్ జైన్

image

కేంద్రం తెచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ చట్టంతో ‘డ్రీమ్ 11’ బ్యానైన విషయం తెలిసిందే. ఆ ప్లాట్‌ఫామ్ కో-ఫౌండర్ హర్ష్ జైన్ తాజాగా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘ఇన్నింగ్స్ బ్రేక్ దాదాపుగా అయిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో పెద్ద స్కోర్ ఛేజ్ చేయాలి. మా టీమ్ అదరగొట్టేందుకు రెడీగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ఏం చేయబోతున్నారు అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఆయన చేసిన ఈ క్రిప్టిక్ ట్వీట్ ఇప్పుడు SMలో వైరలవుతోంది.

News December 3, 2025

శుభ సమయం (03-12-2025) బుధవారం

image

✒ తిథి: శుక్ల త్రయోదశి ఉ.10.02 వరకు
✒ నక్షత్రం: భరణి సా.4.52 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: తె.4.03-ఉ.5.33
✒ అమృత ఘడియలు: మ.12.46-మ.2.15