News September 20, 2024

వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

వాటర్ హీటర్‌తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిన్న NZB జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నీళ్లు వేడెక్కాయో లేదో చూసేందుకు హీటర్ ఉండగానే బకెట్‌లో చేయి పెట్టడంతో షాక్ తగిలి మరణించాడు. స్విచ్ఛాఫ్ చేసి ప్లగ్ తీసేసిన తర్వాతే నీటిని ముట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇనుము లేదా స్టీల్ కాకుండా ప్లాస్టిక్ బకెట్లు వాడాలని, అవి కరగకుండా ఓ చెక్క ముక్క ఉపయోగించాలంటున్నారు.
>SHARE IT

Similar News

News December 26, 2025

NIEPMDలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టీఫుల్ డిజబిలిటీస్ <>(NIEPMD)<<>> 25 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, BCom, MCom, MBA, PG, B.Ed, M.Ed, సంబంధిత విభాగంలో PhD, M.Phil ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 56ఏళ్లు. వెబ్‌సైట్: https://niepmd.nic.in

News December 26, 2025

ఇతిహాసాలు క్విజ్ – 108

image

ఈరోజు ప్రశ్న: హనుమంతుడికి ‘బజరంగబలి’ అనే పేరు ఎలా వచ్చింది?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 26, 2025

మామిడిలో మంచి పూతకు నిపుణుల సూచనలు

image

మామిడిలో పూమొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి, ఆడపూల శాతం పెంచడానికి లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10గ్రా., లీటరు నీటికి బోరాన్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి. పూమొగ్గ దశలో తేనెమంచు పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml కలిపి పూత మొదలయ్యే సమయం, పిందెలు తయారయ్యే సమయంలో పూత, ఆకులపైనే కాకుండా మొదళ్లపైన, కొమ్మలపైన కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.