News December 5, 2024
OPPO ఫోన్ వాడుతున్నారా?

OPPO స్మార్ట్ ఫోన్లలో టెక్నికల్ ఇష్యూలు వస్తున్నాయని నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ బ్రాండ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన FIND N3 FLIPలో గ్రీన్ లైన్స్ వచ్చి, ఆటోమెటిక్‌గా స్క్రీన్ పగిలిపోయిందని ఓ నెటిజన్ Xలో పోస్ట్ చేశాడు. ఫోన్ కిందపడకుండానే అలా జరగడంతో షాక్ అయ్యానని, సర్వీస్ సెంటర్ వాళ్లు వారంటీ కిందకు రాదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మీకూ ఇలాంటి సమస్యలు వచ్చాయా? కామెంట్ చేయండి.
Similar News
News January 16, 2026
తమిళ ఆడియన్సే అల్లు అర్జున్ టార్గెట్?

‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకులు అట్లీ, లోకేశ్ కనగరాజ్‌తో సినిమాలు ప్లాన్ చేశారు. ‘పుష్ప’తో ఇప్పటికే నార్త్‌లో ఆయనకు మంచి ఆదరణ ఏర్పడింది. సౌత్‌లో AP, TGతో పాటు కేరళ, కర్ణాటకలో ఫాలోయింగ్ ఉంది. ఇక మిగిలింది TN కావడంతో అక్కడి ఆడియన్స్‌నే బన్ని టార్గెట్ చేశారని టాక్. తమిళ స్టార్ డైరెక్టర్లు కావడంతో ఈ సినిమాలు అక్కడ కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానున్నాయి. ఇవి హిట్టయితే బన్నీకి తిరుగులేనట్లే.
News January 16, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 16, 2026
ప్రీటెర్మ్ బర్త్‌కు ఇదే కారణం

గర్భధారణ తర్వాత తొమ్మిది నెలలు నిండాక బిడ్డకు జన్మనివ్వడం సాధారణం. కానీ మరికొందరిలో నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది. దీన్నే ప్రీటెర్మ్ బర్త్ అని కూడా అంటారు. ఇలా నెలల నిండకుండానే డెలివరీ కాకపోవడానికి పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక సమస్యలే ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


