News August 30, 2024

భవిష్యత్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డే సీఎం: కోమటిరెడ్డి

image

TG: భవిష్యత్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. ఓ సభలో ఉత్తమ్‌ను ముఖ్యమంత్రి గారూ అని ఆయన సంబోధించారు. ‘గతంలోనే ఉత్తమ్‌కు సీఎం పదవి కొద్దిలో మిస్ అయ్యింది. ఈసారి మాత్రం పక్కాగా ఆయనకే ముఖ్యమంత్రి పీఠం. నా నాలుకపై నల్లమచ్చలు ఉన్నాయి. నేను ఏదంటే అది జరిగి తీరాల్సిందే’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Similar News

News January 2, 2026

AMPRIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI)లో 13 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 4 ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, బీఎస్సీ(సైన్స్, CS), టెన్త్, ఐటీఐ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. టెక్నికల్ అసిస్టెంట్‌కు నెలకు రూ.66,500, టెక్నీషియన్‌కు రూ.37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ampri.res.in

News January 2, 2026

సిద్ధమవుతున్న బరులు.. సన్నద్ధమవుతున్న పుంజులు

image

సంక్రాంతికి కోడి పందేల కోసం గోదావరి జిల్లాల్లో బరులు సిద్ధమవుతున్నాయి. చాలాచోట్ల పొలాలను చదును చేసి బరులుగా మారుస్తున్నారు. ఇక కొన్నిచోట్ల అయితే బరుల వద్దే సోఫా సీటింగ్, ACలు, లైవ్ స్క్రీన్స్ కోసం ఆర్డర్స్ వచ్చినట్లు షామియానాల నిర్వాహకులు తెలిపారు. అటు కోడిపుంజులనూ పందెంరాయుళ్లు సన్నద్ధం చేస్తున్నారు. రెగ్యులర్‌గా జీడిపప్పు, బాదం తదితర డైట్ ఫుడ్‌కు తోడు ఎక్కువ ఎక్సర్‌సైజులు చేయిస్తున్నారు.

News January 2, 2026

పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి

image

AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన (68) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆమె విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1983లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి సుమన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 1984లో నక్కపల్లిలో బాలికల గురుకులం ఏర్పాటైంది.