News September 12, 2024
చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. వ్యక్తిగత పనులపై విజయవాడ వెళ్లిన ఉత్తమ్ దంపతులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోని రాజకీయాలు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
Similar News
News August 30, 2025
పెన్షన్ రావాలంటే సాయంత్రంలోగా అప్పీల్ చేసుకోండి!

AP: దివ్యాంగులు, ఆరోగ్య పెన్షన్లకు సంబంధించి పునర్పరిశీలనకు అప్పీల్ చేసుకున్న వారికి SEP 1న ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అనర్హుల తొలగింపే లక్ష్యంగా 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు. వీరిలో అర్హులు ఉంటే అప్పీల్ చేసుకోవాలని చెప్పారు. ఇందుకు ఇవాళ సాయంత్రంలోపు అవకాశం ఇచ్చారు. వారితో అప్పీల్ చేయించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లు, MPDOలు, మున్సిపల్ కమిషన్లకు అప్పగించింది.
News August 30, 2025
రక్తహీనత నివారణలో ఏపీ, తెలంగాణ టాప్

రక్తహీనత నివారణ చర్యల్లో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు కేంద్రం వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రక్తహీనత నియంత్రణకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చర్యలను సమీక్షించింది. IFA మాత్రలు, సిరప్ పంపిణీ ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించింది. 2, 3 స్థానాల్లో హరియాణా, TG రాష్ట్రాలు నిలిచాయి. ఐరన్, B-12 విటమిన్ లోపం వల్ల చిన్నారులు, మహిళల్లో రక్తహీనత సమస్య ఉంటుంది.
News August 30, 2025
ట్రంప్ టారిఫ్స్ చట్టవిరుద్ధం: US కోర్టు

విదేశాలపై అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ చట్టవిరుద్ధమైనవని US ఫెడరల్ అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది. అత్యవసర అధికారాల చట్టం కింద సుంకాలు విధించడం ద్వారా ట్రంప్ తన పరిధిని అతిక్రమించారంది. అయితే పెంచిన టారిఫ్లను OCT 14 వరకు కొనసాగించడానికి అనుమతిచ్చింది. అటు ఈ తీర్పు USను నాశనం చేస్తుందంటూ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. SCలో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.