News April 15, 2025
మోదీపై ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ప్రశంసలు

వక్ఫ్ చట్ట సవరణను ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షాదాబ్ షామ్స్ స్వాగతించారు. పేద ముస్లింల బాధను పీఎం మోదీ అర్థం చేసుకున్నారని కొనియాడారు. దీంతో దశాబ్దాలుగా ధనిక, పలుకుబడి ఉన్న ముస్లింలు కబ్జా చేసిన వక్ఫ్ ఆస్తులకు మోక్షం కలుగుతుందన్నారు. ఆ ప్రాపర్టీస్ ఇక పేదలకు ఉపయోగకరంగా మారుతాయన్నారు. వక్ఫ్ చట్ట సవరణపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసన తెలుపుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Similar News
News October 27, 2025
రేపు సీఎంతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

AP: సీఎం చంద్రబాబుతో రేపు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పులపై కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే వీటిపై ఈ సబ్ కమిటీ పలు సూచనలు చేసింది. రేపటి భేటీలో మరింత స్పష్టత రానుంది. డిసెంబర్ 31వ తేదీ లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నవంబర్ 7వ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
News October 27, 2025
ఇందిరమ్మ ఇళ్లు: చెల్లింపులో మార్పులు ఎందుకంటే?

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయడం తెలిసిందే. ఇక నుంచి శ్లాబ్ నిర్మాణం పూర్తయ్యాక ₹2 లక్షలు కాకుండా ₹1.40 లక్షలే ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకంలో ఉపాధి హామీ కింద 90 రోజుల పనిదినాలు కల్పిస్తుండటం, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణం. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక చివరి విడత ₹లక్షతో కలిపి మిగతా ₹60 వేలను అందించనుంది.
News October 27, 2025
తుఫాను ఎఫెక్ట్.. 22 జిల్లాల్లో సెలవులు

AP: మొంథా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే కాకినాడ(D)లో ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు హాలిడేస్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులు ప్రకటించారు. అటు రేపు రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది.


