News December 18, 2024

పశుసంవర్ధకశాఖలో త్వరలో పోస్టుల భర్తీ

image

AP: రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. పశు సంవర్ధక శాఖలో 297 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను APPSC భర్తీ చేయనుంది. అలాగే పశుకిసాన్ క్రెడిట్ కార్డులపై 3% వడ్డీ రాయితీతో రూ.2లక్షల వరకు రుణాలను ఇవ్వాలన్నారు. అటు శ్రీకాకుళం, ప.గో. జిల్లాల్లో ఆగిపోయిన మత్స్యకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News November 13, 2025

NRPT: సమాచార కమిషనర్ల రాక

image

నారాయణపేటకు శుక్రవారం సమాచార కమిషనర్లు వస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు శ్రీనివాసరావు, మౌసిన పర్వీన్ కలిసి పౌర సమాచార అధికారులకు, అప్పీలేట్ అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. అనంతరం పెండింగ్ అప్పీళ్లు పరిశీలించి పరిష్కరిస్తారని అన్నారు.

News November 13, 2025

రోడ్లకు నేతల పేర్లకు బదులు కంపెనీల పేర్లు: సీఎం

image

TG: దేశంలో రోడ్ల‌కు ఎక్కువగా నేతల పేర్లు ఉన్నాయని, హైదరాబాద్‌లో తాము ఆ ట్రెండ్‌ను మార్చాలనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్య‌మైన రోడ్ల‌కు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్ల‌ను పెడ‌తామ‌ని అన్నారు. ఢిల్లీలో జరిగిన US-India సమ్మిట్‌లో సీఎం పాల్గొన్నారు. 30 వేల ఎక‌రాల్లో ‘ఫ్యూచ‌ర్ సిటీ’, మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు చేపట్టామన్నారు.

News November 13, 2025

సింగరేణిలో 82 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సింగరేణిలో 82 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: scclmines.com