News August 18, 2024

RSS ద్వారా పోస్టుల భర్తీ: రాహుల్ ఫైర్

image

ప్ర‌భుత్వ శాఖ‌ల్లోని ఉన్న‌త స్థానాల‌ను UPSC ద్వారా కాకుండా RSS ద్వారా భ‌ర్తీ చేస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోంద‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యమైన పోస్టుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్‌మెంట్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కుంటున్నారని రాహుల్ మండిప‌డ్డారు. తద్వారా బ్యూరోక్ర‌సీలో అణ‌గారిన వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం లేకుండా పోతోంద‌న్నారు.

Similar News

News July 7, 2025

స్మార్ట్ కార్డులుంటేనే సచివాలయంలోకి ఎంట్రీ!

image

AP: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఎంట్రీకి స్మార్ట్ కార్డు సిస్టమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే వారం నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రతి ఉద్యోగికి క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డు అందజేస్తారు. మెయిన్ గేట్ వద్ద వాహనాల నంబర్‌ను స్కాన్ చేసి అనుమతించనున్నారు. ఇందుకోసం టోల్గేట్ తరహా టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వివరాలు, వాహనాల నంబర్ల సేకరణ ప్రారంభమైంది.

News July 7, 2025

వచ్చే ఏడాది ‘పంచాయత్’ ఐదో సీజన్

image

కామెడీ డ్రామా సిరీస్ ‘పంచాయత్’ ఐదో సీజన్‌ను అనౌన్స్ చేసింది. ఈ సీజన్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్‌ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హిందీ భాషలో రూపొందిన ఈ సిరీస్ నాలుగు పార్టులు ఇతర భాషల ప్రేక్షకులనూ మెప్పించాయి. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌ను తెలుగులో ‘సివరపల్లి’ పేరిట రీమేక్ చేసి ఈ ఏడాది జనవరిలో తొలి సీజన్‌ను రిలీజ్ చేశారు.

News July 7, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. గుంటూరు, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో చిన్నపాటి జల్లులు పడేందుకు ఛాన్స్ ఉందని వివరించింది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం కురిసింది. మీ ప్రాంతంలో వాన పడిందా? కామెంట్ చేయండి.