News March 4, 2025
తిరుమల అన్నప్రసాదంలో వడలు?

AP: శ్రీవారి భక్తులకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ నెల 6 నుంచి వడలు కూడా అందించనున్నట్లు సమాచారం. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా జనవరిలో వారంపాటు రోజుకు 5 వేల చొప్పున వడలను వడ్డించారు. అయితే లక్ష మంది భక్తులకు వడ్డించేందుకు సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించారు.
Similar News
News February 5, 2026
WPL Final: ఢిల్లీ భారీ స్కోరు

WPL ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించింది. కెప్టెన్ జెమీమా(57), లారా (44), లిజెల్లీ లీ(37) రాణించారు. చివర్లో చినెల్లీ హెన్రీ(35*) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. సయాలి, అరుంధతి రెడ్డి, డి క్లెర్క్ తలో వికెట్ తీశారు. బెంగళూరు టార్గెట్ 204.
News February 5, 2026
ఇండియన్స్ అని చెబితే కోప్పడేవారు: తండ్రి

కొందరు అమ్మాయిలు కొరియన్ కల్చర్ అంటే పిచ్చెక్కిపోతున్నారు. ఘజియాబాద్‌లో <<19055978>>ముగ్గురు<<>> అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు కారణం కొరియన్ గేమ్స్ ఆడనివ్వకపోవడమే. ‘నా కూతుళ్లు కొరియాకు తీసుకెళ్లమని అడిగేవారు. మనం ఇండియన్స్ అని చెబితే కోప్పడేవారు. ఒరిజినల్ పేర్లను అలిజా, సిండీ, మారియాగా మార్చేసుకున్నారు’ అని తండ్రి చెప్పారు. దీంతో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. Comment?
News February 5, 2026
VASTHU: అలాంటి ఇల్లు ఆలయంతో సమానం!

క్రమశిక్షణతో కూడిన భక్తి ఉన్న ఇల్లు ఆలయంతో సమానమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు అన్నారు. అచంచలమైన నమ్మకంతో ఇంటి పూజా మందిరంలో కొలువైన దేవతలను పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నారు. ‘ఆగమశాస్త్రయుక్తంగా ప్రాణప్రతిష్ట జరిగిన గుడిలోని మూర్తుల నుంచి శక్తి తరంగాలు వెలువడతాయి. ఇంట్లో వాస్తు రీత్యా దైవపటాలను ఉంచి భక్తితో పూజించినప్పుడు, ఆ ఏకాగ్రతే అక్కడ సాత్విక శక్తిని నింపుతుంది’ అని చెప్పారు. <<-se>>#VASTHU<<>>


