News March 23, 2024
వడోదర బీజేపీ ఎంపీ కీలక నిర్ణయం

వడోదర బీజేపీ ఎంపీ రంజనాబెన్ భట్ వచ్చే లోక్‌సభ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గుజరాత్‌లోని వడోదర స్థానం బీజేపీకి కంచుకోట లాంటిది. 2014 ఎన్నికల్లో మోదీ వారణాసితో పాటు ఇక్కడి నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వడోదర స్థానానికి మోదీ రాజీనామా చేయగా ఉప ఎన్నికలో రంజనా గెలుపొందారు.
Similar News
News October 29, 2025
మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News October 29, 2025
పాక్‌కు చెంపపెట్టులాంటి ఫొటో.. శివాంగీతో ముర్ము

అంబాలా ఎయిర్ బేస్‌లో రఫేల్ రైడ్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్క్వాడ్రన్ లీడర్ శివాంగీ సింగ్‌తో ఫొటో దిగారు. శివాంగీ రఫేల్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పైలట్. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత రఫేల్ జెట్లు కూల్చేశామన్న పాక్.. పైలట్ శివాంగీని ప్రాణాలతో బంధించామని ప్రచారం చేసింది. కానీ ఇవాళ రాష్ట్రపతి ఆమెతో ఫొటో దిగి పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ ఫొటో దాయాదికి చెంపపెట్టులాంటిదనే చెప్పాలి.
News October 29, 2025
ధ్వజస్తంభం లేని గుళ్లలో ప్రదక్షిణ చేయకూడదా?

‘దాదాపు అన్ని ఆలయాల్లో గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. దీని ప్రతిష్ఠాపన వైభవంగా చేస్తారు. ధ్వజస్తంభం కూడా ఆలయ శక్తిలో భాగమే. అయితే కొన్ని ఆలయాల్లో ధ్వజస్తంభం ఉండదు. వాటిని వాయు ప్రతిష్ఠ ఆలయాలు అంటారు. అలాంటి చోట్ల నిత్య పూజ, నైవేద్యాలు తప్పనిసరి కాదు. ధ్వజస్తంభం ఉన్నా, లేకపోయినా గుడిలో ప్రదక్షిణ చేయవచ్చు. ఇంట్లో తులసి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే ఇది కూడా శుభప్రదం’ అని పండితులు చెబుతున్నారు.


