News October 13, 2025

వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

image

14 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రీడా ప్రపంచాన్ని మెప్పించిన వైభవ్ సూర్యవంశీకి బిహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోషన్ ఇచ్చింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ తొలి 2 రౌండ్లకు వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఆ జట్టు కెప్టెన్‌గా సకీబుల్ గని వ్యవహరించనున్నారు. ఎల్లుండి నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కాగా IPLలో RR తరఫున అదరగొట్టిన వైభవ్.. ఇటీవల IND-U19 జట్టు తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించారు.

Similar News

News October 13, 2025

పిల్లలకు వాడకూడని 3 వస్తువులు

image

మూడేళ్లలోపు పిల్లల శరీరం అతి సున్నితమైంది. కొందరు పేరెంట్స్ వారికి హార్డ్ బ్రష్‌తో పళ్లు తోముతుంటారు. ఇది వారి మృదువైన చిగుళ్లకు హాని కలిగిస్తుంది. ఇక స్నానం చేయించేటప్పుడు స్క్రబ్బర్‌తో రుద్దడాన్ని చిన్నారుల సున్నితమైన చర్మం తట్టుకోలేదు. తలస్నానం చేయించాక హెయిర్ డ్రయ్యర్ వినియోగం వల్ల వారి కుదుళ్లు దెబ్బతిని త్వరగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా మీరు చేయిస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి. SHARE IT

News October 13, 2025

LED స్క్రీన్‌లో వేములవాడ రాజన్న దర్శనం

image

TG: వేములవాడ అభివృద్ధి పనుల నేపథ్యంలో LED స్క్రీన్ ద్వారా రాజరాజేశ్వర స్వామి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మేడారం జాతర సందర్భంగా భక్తులు ఇక్కడికీ పెద్ద సంఖ్యలో తరలివస్తారని వెల్లడించారు. తొలుత భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక <<17983463>>ఏర్పాట్లు<<>> చేసిన విషయం తెలిసిందే.

News October 13, 2025

‘భారత కెప్టెన్‌ను మార్చాలి’.. ఫ్యాన్స్ డిమాండ్

image

స్వదేశంలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్‌పై భారత జట్టుతో పాటు ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ SA, AUSపై వరుస ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు. గెలవాల్సిన మ్యాచ్‌ల్లో హర్మన్ కెప్టెన్సీ వల్లే ఓడిపోయామని ఫైరవుతున్నారు. బ్యాటింగ్‌లోనూ విఫలమవుతున్న తనను(21, 19, 9, 22) కెప్టెన్సీ నుంచి తొలగించాలని BCCIని డిమాండ్ చేస్తున్నారు. అటు IND సెమీస్‌కు వెళ్లాలంటే మిగతా 3 మ్యాచ్‌లూ కీలకం కానున్నాయి.