News August 29, 2025
ప్రో కబడ్డీ లీగ్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 అట్టహాసంగా ప్రారంభమైంది. వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో లీగ్ మొదలైంది. ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కోర్టులో కబడ్డీ, క్రికెట్ ఆడి ప్రేక్షకులను అలరించారు. కాగా తొలి మ్యాచులో భాగంగా తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ తలపడుతున్నాయి.
Similar News
News August 30, 2025
డిసెంబర్‌లో ఇండియాకు పుతిన్!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది డిసెంబర్‌లో భారత పర్యటనకు రానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. గత మేలో ప్రధాని మోదీ పుతిన్‌ను ఇండియాకు రావాలని ఆహ్వానించారు. కాగా సెప్టెంబర్ 1న చైనాలో జరిగే ప్రాంతీయ సమావేశంలో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఒకే వేదికపై కలవనున్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు, అమెరికా టారిఫ్స్ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
News August 30, 2025
రిటైర్మెంట్ వయసు పెంపుపై తప్పుడు ప్రచారం: FactCheck

AP: పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీలు/ కార్పొరేషన్లు/ సొసైటీలలో పని చేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ఓ నకిలీ జీవో చక్కర్లు కొడుతోందని FactCheck ట్వీట్ చేసింది. వాస్తవ జీవోలో 60 నుంచి 62 సం.కు పెంచుతున్నట్లుగా మాత్రమే ఉందని తెలిపింది. కొందరు తప్పుడు జీవోను ప్రచారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
News August 29, 2025
ఒకేసారి 5 ఉద్యోగాలు కొట్టిన ‘అమ్మ’

AP: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ ఒకేసారి 5 ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సరుబుజ్జిలి(M) మతలబుపేటకు చెందిన చింతా రాధాకుమారి-కేఎల్ నాయుడుకు ఇద్దరు పిల్లలు. ఎప్పటికైనా టీచర్ కావాలనే ఆశయంతో సంసారాన్ని నడిపిస్తూనే రాధ MA, లాంగ్వేజ్ పండిట్ కోర్స్, TTC, B.Ed పూర్తి చేశారు. ఇటీవల ప్రకటించిన DSCలో SGT-14, SA తెలుగు-23, SA సోషల్-39, TGT తెలుగు-113,TGT సోషల్‌లో 77వ ర్యాంక్ సాధించారు.