News December 25, 2024

వచ్చే నెల 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు: TTD

image

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్ని వచ్చే నెల 10 నుంచి ప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. వచ్చే నెల 8న ఉదయం 6 గంటల నుంచి టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమల, తిరుపతిలో 9 కేంద్రాల్లో 91 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక గోవింద మాల భక్తులకు ప్రత్యేకంగా టికెట్లను ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News November 27, 2025

KNR: ‘వచ్చే బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలి.’

image

కరీంనగర్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన TMKMKS రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి గురువారం గోరింకల నరసింహ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తె.మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ హాజరై మాట్లాడారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలని, ప్రతి మత్స్య సొసైటీకి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.

News November 27, 2025

బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: KTR

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం 17 శాతమే ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. CM రేవంత్ రాజకీయ నాయకుడిలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని.. హిల్ట్ పాలసీ పేరుతో 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు.

News November 27, 2025

పెళ్లికి రెడీ.. అమ్మాయి కావాలి అంతే: చాహల్

image

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ ఫొటోలను షేర్ చేసిన ఈ స్పిన్నర్.. ‘నేను పెళ్లికి రెడీగా ఉన్నా. అమ్మాయి కావాలి అంతే’ అని క్యాప్షన్ పెట్టారు. భార్యతో విడాకులు అయితే చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్తారని, కానీ చాహల్ కాన్ఫిడెన్స్‌కు మెచ్చుకోవాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.