News January 10, 2025

తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

image

AP: తిరుమలలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి పూజలు, హారతి, పుష్ప సమర్పణ చేశారు. తె.4.30 నుంచి ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 10రోజులు శ్రీవారు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వనున్నారు. అటు శ్రీశైలంలో ఉత్తర ద్వారం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెలుపలికి తీసుకొచ్చి రావణ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి వేళ పుష్పార్చన నిర్వహించనున్నారు.

Similar News

News January 10, 2025

మహా కుంభమేళాలో ఈ బాబాలు స్పెషల్

image

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఈనెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. 12 పుష్కరాల తర్వాత జరగనుండటంతో అన్ని ప్రాంతాల నుంచి భక్తులు, సాధువులు, అఘోరాలు నదీ స్నానానికి వెళ్తున్నారు. అయితే, ఇందులో రోజుకు పది కప్పుల టీ తాగుతూ జీవనం సాగిస్తున్న ‘చాయ్ వాలే బాబా’, తలపై వరి, శనగ మొక్కలను పెంచుతున్న అనాజ్ వాలే బాబా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

News January 10, 2025

PHOTOS: వైకుంఠ ఏకాదశి స్పెషల్

image

TG: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి వైకుంఠ ద్వారం గుండా స్వామి వారి దర్శనం చేసుకున్నారు. యాదగిరి గుట్ట, భద్రాచలం, నిజామాబాద్ వెంకటేశ్వర స్వామి, వేములవాడ రాజన్న, భువనగిరి స్వర్ణగిరి తదితర ఆలయాల్లో సందడి నెలకొంది.

News January 10, 2025

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో షాక్

image

AP: పోక్సో కేసుకు సంబంధించి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేశారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన పిటిషన్ వేయగా హైకోర్టు కొట్టివేసింది.