News February 14, 2025

Valentine’s Day SPECIAL.. మన కొండా లవ్ స్టోరీ తెలుసా..?

image

ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో ది బెస్ట్ లవ్ కపుల్ ఎవరంటే కొండా మురళి, సురేఖ దంపతులని ఎవరిని అడిగినా చెప్పేస్తారు. 1980లో వరంగల్ LB కళాశాలలో చిగురించిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. 1987లోనే సురేఖను తిరుపతి తీసుకెళ్లి మురళి పెళ్లి చేసుకున్నారట. వీరి ప్రేమపై ‘కొండా’ మూవీ సైతం వచ్చిన విషయం తెలిసిందే. మీకు తెలిసిన ఓ లవ్ స్టోరీని కామెంట్ చేయండి.

Similar News

News November 9, 2025

సిద్దిపేట: ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్

image

నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 2230 కాంపౌండబుల్ కేసుల్లో రాజీ పడవచ్చని, ఈనెల 15 వరకు ప్రతి రోజు లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. చిన్న చిన్న కేసుల్లో కోర్ట్ చుట్టూ తిరుగుతున్న ప్రజలకి ఇదొక మంచి అవకాశమని, రాజీ పడదగిన కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.
– SHARE IT

News November 9, 2025

ములుగులో బాలుడి మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమా?

image

కన్నాయిగూడెం మండలం గూరేవులకు చెందిన హరినాథ్(7) పాముకాటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పాముకాటుకు వైద్యుడి పర్యవేక్షణలో యాంటీ డోస్ ఇవ్వాల్సి ఉండగా, ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడం, ఉన్న సిబ్బంది సరైన రీతిలో స్పందించక పోవడంతో ఈ దారుణం జరిగిందని వారు వాపోతున్నారు.

News November 9, 2025

మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్ హింస సరికాదు: జస్టిస్ సూర్యకాంత్

image

సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ వేదికగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న హింసను కాబోయే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. వారి ప్రతిష్ఠకు హాని కలగకుండా నిర్ధిష్టమైన సెక్యూరిటీ ప్రొటోకాల్ అనుసరించాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ 31వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాంకేతికతను వాడుకొని వారి ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, వారిని ట్రోలింగ్ సరైన చర్య కాదని పేర్కొన్నారు.