News February 14, 2025
Valentine’s Day SPECIAL.. మన కొండా లవ్ స్టోరీ తెలుసా..?

ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో ది బెస్ట్ లవ్ కపుల్ ఎవరంటే కొండా మురళి, సురేఖ దంపతులని ఎవరిని అడిగినా చెప్పేస్తారు. 1980లో వరంగల్ LB కళాశాలలో చిగురించిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. 1987లోనే సురేఖను తిరుపతి తీసుకెళ్లి మురళి పెళ్లి చేసుకున్నారట. వీరి ప్రేమపై ‘కొండా’ మూవీ సైతం వచ్చిన విషయం తెలిసిందే. మీకు తెలిసిన ఓ లవ్ స్టోరీని కామెంట్ చేయండి.
Similar News
News February 23, 2026
నాగర్‌కర్నూల్: 3 రోజులు కొట్టుమిట్టాడిన పసి ప్రాణం..!

FEB 18- కుమ్మెర జాతరలో దాడి, PSలో బాధితుల ఫిర్యాదు
FEB 21- 3రోజుల తర్వాత చికిత్స పొందుతూ చిన్నారి మృతి, మళ్లీ PSకు వచ్చిన బాధితులు
FEB 21- పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుల ఆరోపణ
FEB 21- వార్త తెలిసి ఆగ్రహించిన ధర్మ సమాజ్ నేతలు NGKLఆస్పత్రి ఎదుట ధర్నా
FEB 21- నిందితులపై కేసు నమోదు చేస్తామని DSP హామీ
FEB 22- బాధితులకు మద్దతిస్తూ BRS, TRP, బీసీ సంఘాల నేతల ధర్నా
FEB 22- ముగ్గురు నిందితుల అరెస్ట్
News February 23, 2026
నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.
News February 23, 2026
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


