News February 10, 2025
వాలెంటైన్స్ వీక్: ఇవాళ టెడ్డీ డే

వాలెంటైన్స్ వీక్‌లో నాలుగో రోజును టెడ్డీ డేగా పిలుస్తారు. ఇవాళ ప్రియురాలికి టెడ్డీని బహుమతిగా ఇస్తారు. తమ మధ్య ప్రేమబంధానికి ప్రతీకగా దీనిని భావిస్తారు. వీటిలో రెడ్ కలర్ డీప్ లవ్, పింక్ కలర్ ప్రపోజల్, ఆరెంజ్ హ్యాపీనెస్, ఎగ్సైజ్‌మెంట్‌కు గుర్తు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ థియోడర్ టెడ్డీ రూజ్ వెల్ట్ పేరు మీదుగా ‘టెడ్డీ’ బేర్ అనే పేరు వచ్చింది.
Similar News
News November 9, 2025
గుకేశ్‌కు షాక్.. చెస్ వరల్డ్ కప్‌లో ఓటమి

గోవా వేదికగా జరుగుతోన్న చెస్ వరల్డ్ కప్‌లో ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు షాక్ తగిలింది. మూడో రౌండ్‌లో ఫ్రెడరిక్ స్వాన్(జర్మనీ) చేతిలో 0.5-1.5 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, అర్జున్, హరికృష్ణ, ప్రణవ్ తదుపరి రౌండ్లకు దూసుకెళ్లారు.
* ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఏషియన్ చెస్ ఛాపింయన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రాహుల్.. భారత్ తరఫున 91వ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు.
News November 9, 2025
సినిమా అప్డేట్స్

* అనుకోని కారణాలతో ఆగిపోయిన జులన్ గోస్వామి బయోపిక్ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ను(అనుష్క శర్మ లీడ్ రోల్) విడుదల చేయడానికి మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చిస్తున్నారు.
* వాల్ట్ డిస్నీ నిర్మించిన ‘జూటోపియా’ మూవీకి హిందీలో జూడీ హోప్స్ పాత్రకు శ్రద్ధా కపూర్ వాయిస్ ఇస్తున్నారు. ఈ మూవీ NOV 28న రిలీజవనుంది.
* దళపతి విజయ్ నటించిన ‘జన నాయకుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ మూవీ JAN 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News November 9, 2025
APPLY NOW: THDCలో ఉద్యోగాలు

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(THDC) 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. మైన్ సర్వేయర్, మైన్ జూనియర్ ఓవర్‌మెన్ పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్ట్, సీబీటీ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://thdc.co.in


