News June 27, 2024
చేతిరాత బిల్లులకు చెల్లు.. ఇక ఆన్లైన్ పర్మిట్లే

AP: గనుల శాఖలో, ఇసుక అమ్మకాల్లో ఆన్లైన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లు చేతిరాతతో ఇచ్చిన బిల్లులతో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం అంటోంది. దీంతో గత టీడీపీ హయాంలో ఉన్న ఆన్లైన్ విధానాన్నే తీసుకురానున్నారు. ఈ మేరకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇటు సీవరేజి వసూళ్ల కాంట్రాక్టర్లూ ఆన్లైన్ పర్మిట్లే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News March 13, 2025
IPL: హ్యారీ బ్రూక్పై రెండేళ్ల నిషేధం

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఐపీఎల్లో రెండేళ్లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతో బ్రూక్ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. 2028 ఐపీఎల్లో మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది. కాగా ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ రూల్ ప్రకారం సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ల నిషేధం విధిస్తారు.
News March 13, 2025
దస్తగిరికి భద్రత పెంపు

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరికి ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉండగా ఇకపై 2+2కు గన్మెన్లను కేటాయించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకా హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఆయన ఇటీవల విన్నవించారు. దీంతో సెక్యూరిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
News March 13, 2025
రూపాయి గుర్తు ఎలా రూపొందించారంటే..

దివంగత ఆర్థిక మంత్రి ప్రణబ్ 2009 కేంద్ర బడ్జెట్ సమయంలో రూపాయికి గుర్తు సూచించాలని ఓపెన్ కాంపిటిషన్ ప్రకటించారు. 3331 డిజైన్లలో 5 షార్ట్ లిస్ట్ చేసి DMK మాజీ MLA కుమారుడు, ప్రొఫెసర్ ఉదయ్ పంపినది ఎంపిక చేశారు. ఇది దేవనాగరి లిపి र “ra”, లాటిన్ ఇంగ్లిష్లో నిలువు గీత లేని Rను పోలి ఉంటుంది. ₹లో 2 సమాన అడ్డగీతలు అసమానతల్లేని సంపద పంపిణీని సూచిస్తాయి.
PS: గతంలో Rs, Re, రూ. అని భిన్న రూపాయి సూచకాలుండేవి.