News June 4, 2024
గన్నవరంలో వల్లభనేని వంశీ వెనుకంజ

AP: కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు లీడ్‌లో ఉన్నారు. బాపట్ల MP స్థానంలో TDP అభ్యర్థి కృష్ణప్రసాద్ లీడింగ్‌లో ఉన్నారు. అవనిగడ్డలో జనసేన నేత బుద్ధప్రసాద్ ముందంజలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బోండా ఉమ లీడింగ్‌లో ఉన్నారు. ఇటు విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి లీడింగ్‌లో ఉన్నారు.
Similar News
News September 8, 2025
DRDO-CHESSలో 25 పోస్టులు

హైదరాబాద్‌లోని DRDOకు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్(CHESS)లో 25 అప్రెంటిస్ పోస్టులున్నాయి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమా పాసై ఉండాలి. అభ్యర్థుల మార్కుల శాతం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు ఈ నెల 22 చివరి తేదీ. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9వేలు, టెక్నీషియన్అప్రెంటిస్‌లకు రూ.8వేలు స్టైఫండ్ ఇస్తారు. వెబ్సైట్: drdo.gov.in
News September 8, 2025
LIC హౌసింగ్‌లో 192 ఖాళీలు

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 192 అప్రెంటిస్ ఖాళీలకు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై, 20-25 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.12వేలు స్టైఫండ్ అందుతుంది.
వెబ్సైట్: <
News September 8, 2025
భారత్‌పై అమెరికా టారిఫ్స్ సరైనవే: జెలెన్స్కీ

భారత్‌పై అమెరికా సుంకాలు విధించడం సరైనదేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రష్యాతో డీల్ కొనసాగిస్తున్న దేశంపై టారిఫ్స్ విధించడం మంచి ఐడియానే’ అని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ ముగింపునకు ఇతర దేశాలతో కలిసి కృషి చేస్తున్న భారత్‌పై జెలెన్స్కీ తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ కూడా ఆయనతో పలుమార్లు ఫోన్లో <<17582171>>మాట్లాడిన<<>> విషయం తెలిసిందే.