News February 14, 2025

వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. నిన్న ఉదయం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు 8 గంటల పాటు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. దాదాపు 2 గంటలపాటు వాదనలు జరిగాయి. A1 వంశీతో పాటు A7 శివరామకృష్ణ, A8 లక్ష్మీపతికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

Similar News

News November 2, 2025

నాకు ప్రాణ భయం.. భద్రత పెంచండి: తేజ్ ప్రతాప్

image

బిహార్ ఎన్నికల వేళ లాలూ పెద్ద కుమారుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ శత్రుత్వంతో తనపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందన్నారు. తనకు ప్రాణభయం ఉందని, భద్రత మరింత పెంచాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇటీవల దుండగుల కాల్పుల్లో జన్‌సురాజ్ కార్యకర్త మరణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కుటుంబ విభేదాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్‌ను RJD నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

News November 2, 2025

దేశంలోనే తొలి మహిళా ఈటీవో

image

రోమీతా బుందేలాకు చిన్నప్పటి నుంచే నీళ్లంటే ఇష్టం. నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. చివరికి ఎలక్ట్రో టెక్నికల్‌ ఆఫీసర్‌ కోర్సు కనిపించింది. షిప్‌లో పవర్‌ మేనేజ్‌మెంట్‌ చెయ్యడం ప్రధాన విధి. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఆ కోర్సు పూర్తి చేశారు. నీళ్ల మధ్యలో నెలల తరబడి సముద్రంలో ఉండాల్సి వచ్చేది. విపరీతమైన ఒత్తిడి. వాటిని దాటి ఎన్నో పదోన్నతులు పొంది ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తున్నారు.

News November 2, 2025

రేపు సీఏ ఫలితాలు

image

దేశవ్యాప్తంగా నిర్వహించిన సీఏ ఫైనల్, ఇంటర్మీడియెట్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను ICAI రేపు విడుదల చేయనుంది. సీఏ ఫైనల్, ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ 2PMకు, ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్స్ ఫలితాలు 5PMకు రిలీజవుతాయి. https://www.icai.org/లో రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి స్కోర్‌ను తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ 3-22 మధ్య ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.