News February 24, 2025
3 రోజుల పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే ఆయనను విచారించాలని ఆదేశించింది. ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
Similar News
News February 24, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: NZ టార్గెట్ ఎంతంటే?

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 236/9 స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ శాంటో (77), జాకిర్ అలీ (45) రాణించారు. NZ బౌలర్లలో బ్రేస్‌వెల్ 4 వికెట్లు పడగొట్టగా, రూర్కీ 2, హెన్రీ, జెమీసన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే బంగ్లాదేశ్‌తో పాటు పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.
News February 24, 2025
విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి

AP: గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం నెలకొంది. గోశాల వద్ద విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఓ రైతుతో పాటు ముగ్గురు కూలీలు ఉన్నట్లు సమాచారం
News February 24, 2025
AP మిర్చికి కేంద్రం మద్దతు ధర

AP: మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద ఏపీ మిర్చికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటా మిర్చికి రూ.11,781 ధర ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ధర లేదంటూ ఏపీలో రైతులు ఆందోళన చేయగా, సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి దీనిపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేంద్రం మద్దతు ధరపై ఈ ప్రకటన చేసింది. తొలి క్వింటా మిర్చి సేకరణ నుంచి నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి.