News August 9, 2024

విలువైన వ్యాపారాలున్నది వీరికే

image

దేశంలో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో అంబానీలు మొద‌టి స్థానంలో ఉండగా రూ.7.13 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌జాజ్‌, రూ.5.39 ల‌క్ష‌ల కోట్ల విలువ‌తో బిర్లా కుటుంబాలు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక AP, TG నుంచి డా.రెడ్డీస్ ప్ర‌సాద్ (21), దాట్ల (83), ఎన్‌సీసీ రాజు (92) అరాజెన్ కేశ‌వ‌రెడ్డి (106), మేధాస‌ర్వో రెడ్డి (115) న‌వ లిమిటెడ్ ప్ర‌సాద్‌, దేవినేని (134) ఫ్యామిలీలు ఈ జాబితాలో ఉన్నాయి.

Similar News

News March 12, 2026

కోడిగుడ్డు ధరలు తగ్గాయ్..

image

తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కారణంగా ఎగుమతులు భారీగా తగ్గిపోయి నిల్వలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కొన్ని వారాల క్రితం ఒక్కో గుడ్డు రూ.7-8 ఉండగా ఇప్పుడు హోల్ సేల్ మార్కెట్లో రూ.3.5-4కే అమ్ముతున్నారు. రిటైల్‌లో మాత్రం రూ.6 వరకు తీసుకుంటున్నారు. మరి మీ దగ్గర గుడ్డు రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.

News March 12, 2026

ఇరాన్ యుద్ధం.. భారత్‌కు బిగ్ రిలీఫ్

image

క్రూడాయిల్ రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిలో భారత నౌకల రవాణాకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు NDTV తెలిపింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీతో చర్చల తర్వాత ఈ నిర్ణయం వెలువడినట్లు పేర్కొంది. దీంతో పుష్పక్, పరిమల్ అనే ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ల ద్వారా గల్ఫ్ దేశాల ఆయిల్‌ను మనం సులభంగా దిగుమతి చేసుకోవచ్చు. అటు US, యూరప్, ఇజ్రాయెల్ దేశాల నౌకలపై ఆంక్షలు కొనసాగనున్నాయి.

News March 12, 2026

సాయుధ బలగాల్లో 93,139 ఉద్యోగాలు: నిత్యానంద రాయ్

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF), అస్సాం రైఫిల్స్‌లో 93,139 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటులో వెల్లడించారు. CISF-28,342, CRPF-27,400, BSF-14,531, ITBP-12,333, SSB-6,784, అస్సాం రైఫిల్స్-3,749 ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. UPSC, SSC ద్వారా ఏటా పోస్టుల భర్తీ కొనసాగుతోందని చెప్పారు.