News August 6, 2024
విలువలతో కూడిన రాజకీయాలు మావి: బొత్స
AP: డబ్బుతో ఓట్లు కొనాలని CM చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని YCP MLC అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ‘స్థానిక సంస్థల్లో YCPకి 600కుపైగా సభ్యుల బలం ఉంది. కూటమికి 200 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఓట్లు కొనాలని కుట్ర పన్నుతున్నారు. కానీ ఓట్లు కొనకుండా YCP విలువలతో కూడిన రాజకీయం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News January 27, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ.. రేపు టికెట్లు విడుదల
FEB 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు ICC వెల్లడించింది. PAK కాలమానం ప్రకారం మ.2 గంటలకు టికెట్లు <
News January 27, 2025
శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ సీజ్
TG: మాదాపూర్‌లో శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు చేసిన అధికారులు తాజాగా కిచెన్‌ను సీజ్ చేశారు. ఈ మేరకు ఆ ఫొటోలను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ట్వీట్ చేశారు. ఆరు నెలల వ్యవధిలో పలుమార్లు చేసిన తనిఖీల్లో పిల్లలకు నాసిరకం భోజనం అందిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే.
News January 27, 2025
విడాకుల తర్వాత బాధపడ్డా.. కానీ ధైర్యాన్ని కోల్పోలేదు: సమంత
విడాకులు తీసుకున్న మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో తనకు బాగా తెలుసునని హీరోయిన్ సమంత చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నా గురించి ఎన్నో అబద్ధాలు పుట్టించారు. అందులో నిజం లేదని చాలాసార్లు చెప్పాలనిపించింది. అయితే నాతో నేను చేసుకున్న సంభాషణే ఆపింది. డివోర్స్ తర్వాత బాధగా అనిపించినా నేను ఏడుస్తూ ధైర్యాన్ని కోల్పోలేదు. నా జీవితంలో తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా’ అని పేర్కొన్నారు.