News August 12, 2025
CBIకి వామనరావు కేసు.. నాడు ఏం జరిగింది..?

తెలంగాణ హైకోర్టు లాయర్ దంపతులు గట్టు <<6386668>>వామన రావు<<>>, నాగమణి 2021 FEB 17న హత్యకు గురయ్యారు. కారులో వెళ్తున్న వారిని పెద్దపల్లి జిల్లా కాల్వచర్ల సమీపంలో దుండగులు అడ్డుకుని కత్తులతో దాడి చేయగా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మంథని PSలో ఓ కస్టోడియల్ డెత్ సహా పలు అంశాలపై HCలో <<17379008>>వామనరావు<<>> పిల్స్ వేశారు. వాటిపై కొందరు పోలీసులు తనను బెదిరిస్తున్నారని 2020లో HCకి లేఖ రాశారు.
Similar News
News August 12, 2025
ChatGPT సలహా ప్రాణం మీదకొచ్చింది!

డైట్ ప్లాన్ కోసం ChatGPTని వాడిన 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు. టేబుల్ సాల్ట్‌కు బదులు సోడియం బ్రోమైడ్ తీసుకోవాలని సూచించడంతో అతను 3 నెలలుగా దీనిని వాడుతున్నాడు. ఇది విషంగా మారడంతో అతను మతిస్థిమితం కోల్పోయాడని, తీవ్రదాహం, పట్టుకోల్పోవడం వంటి సమస్యలు ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత అతను కోలుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
News August 12, 2025
మోదీ జీ.. ట్రాఫిక్ నుంచి కాపాడాలంటూ చిన్నారి లేఖ

బెంగళూరులోని ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాసిందో ఐదేళ్ల చిన్నారి. ‘నరేంద్ర మోదీ జీ. ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మేము పాఠశాలలకు, ఆఫీసులకు లేటుగా వెళ్తున్నాం. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ప్లీజ్ హెల్ప్ చేయండి’ అని లేఖలో రాసింది. ఈ ఫొటోను ఆ చిన్నారి తండ్రి ట్విటర్‌లో షేర్ చేయగా వైరలవుతోంది. ఇక్కడ పీక్ టైమ్‌లో KM ప్రయాణించేందుకు గంట పడుతుందని చెబుతుంటారు.
News August 12, 2025
ప్రియాంక కామెంట్స్‌కు ఇజ్రాయెల్ అంబాసిడర్ కౌంటర్

పాలస్తీనాలో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ ఆరోపించారు. 18,430 మంది పిల్లలు సహా 60వేల మందిని దారుణంగా హతమార్చిందన్నారు. ఇంత జరుగుతున్నా భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. దీంతో హమాస్‌కు వత్తాసు పలకడం మానుకోవాలని ప్రియాంకకు ఇజ్రాయెల్ అంబాసిడర్ అజార్ సూచించారు. పౌరుల మాటున దాక్కున్న ఉగ్రవాదులే తమ లక్ష్యమన్నారు. 25వేల టెర్రరిస్టులను చంపినట్లు చెప్పారు.