News March 20, 2025

వంశీకి మూడు రోజుల సీఐడీ కస్టడీ

image

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మూడు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని విచారించాలని సీఐడీ కోరగా 3వ ఏసీజేఏం కోర్టు ఆ మేరకు ఆదేశాలిచ్చింది. దీంతో ఈ నెల 22, 23, 24 తేదీల్లో విజయవాడలోని కార్యాలయంలో ఆయన్ను విచారించనున్నారు. ఈ కేసులో వంశీ ఏ71గా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళే విచారణ జరగనుంది.

Similar News

News November 4, 2025

ఆలయాల్లో రద్దీ.. జాగ్రత్తలు

image

కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తొక్కిసలాటలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు..
*క్యూలలో వ్యతిరేక దిశలో ప్రవేశించకూడదు
*ముందున్న భక్తులను నెట్టకూడదు
*పరుగు తీయడం లేదా తోసుకోవడం చేయొద్దు
*సిబ్బంది సూచనలు పాటించాలి. గుంపులుగా ఉండొద్దు.
*రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు దర్శనం కోసం సహనంతో వేచి ఉండాలి
*తొక్కిసలాట పరిస్థితులు కనిపించగానే దూరంగా వెళ్లాలి

News November 4, 2025

ఏపీ రౌండప్

image

* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ అధీనంలోనే ఉందన్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
* ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా బొజ్జిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
* ఇవాళ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని.. కేంద్ర కార్యాలయానికి లోకేశ్
* రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో 1,49,302 హెక్టార్లలో పంట నష్టం!

News November 4, 2025

సమానత్వం అప్పుడే ఎక్కువ

image

మహిళలు అనునిత్యం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల సమానత్వం అన్నది పుస్తకాలకే పరిమితమైంది. అయితే పురాతన కాలంలోనే ఈజిప్టు మహిళల్ని పురుషులతో సమానంగా పరిగణించేవారట. వాళ్లకంటూ సొంత ఆస్తులు, విడాకులు తీసుకునే హక్కులతోపాటు మత, రాజకీయ పదవులూ కలిగి ఉండేవారని తొలి పురావస్తు రికార్డులు చెబుతున్నాయి.