News February 13, 2025
వంశీని టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు: YCP

AP: గన్నవరం మాజీ MLA, YCP నేత వల్లభనేని వంశీని హైదరాబాద్లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ మండిపడింది. అక్రమ కేసులో అరెస్ట్ చేశారని, గన్నవరం TDP ఆఫీస్పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉందని గుర్తు చేసింది. ఆ దాడిపై ఫిర్యాదును ఇటీవల సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారని ట్వీట్ చేసింది. కానీ, వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
Similar News
News December 10, 2025
APPLY NOW:TIFRలో ఉద్యోగాలు..

ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 3వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.tifr.res.in
News December 10, 2025
మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్స్కీ

ఉక్రెయిన్లో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. అయితే యుద్ధ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలంటే మిత్రదేశాల నుంచి భద్రత, సహకారం అవసరమని చెప్పారు. మరోవైపు ప్రతిపక్షం కూడా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అభిప్రాయపడుతోంది.
News December 10, 2025
దేశంలో పెరిగిన అమ్మాయిల సగటు వివాహ వయస్సు

దేశంలో బాలికల సగటు వివాహ వయస్సు 22.9 సంవత్సరాలకు చేరుకుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అమ్మాయిల సగటు వివాహ వయస్సు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో బాలికల వివాహ వయస్సు సగటున 22.1 సంవత్సరాలుగా ఉంది. ఇది 2020లో 22.7కి పెరిగింది. 2021లో ఇది 22.5 కాగా, 2022లో ఇది 22.7కి చేరుకుంది.


