News April 12, 2025
వనజీవి రామయ్య త్యాగం అసమాన్యం: KCR

TG: వనజీవి రామయ్య మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. పర్యావరణం కోసం రామయ్య త్యాగం అసమాన్యమని తెలిపారు. హరితహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన అందించిన సహకారం గొప్పదని పేర్కొన్నారు. వనజీవి మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే హరీశ్ రావు సంతాపం తెలియజేశారు.
Similar News
News December 6, 2025
కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు(1/2)

వైరస్ ఆశించిన కూరగాయల మొక్కల్లో లేత ఆకులు చిన్నగా, పసుపు రంగుకు మారి పాలిపోయినట్లు కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై అక్కడక్కడ పసుపురంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులపై పసుపు చారలు ఏర్పడి, గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనెల మధ్యభాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకుల ఈనెలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారతాయి. మొక్క చివరి ఆకులు ఎండి, చనిపోయినట్లుగా ఉంటాయి.
News December 6, 2025
అంబేడ్కర్ గురించి ఈ విషయాలు తెలుసా?

*విదేశాల్లో ఎకనామిక్స్‌లో PhD చేసిన తొలి భారతీయుడు
*కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో 29, హిస్టరీలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆస్ట్రాలజీలో 4, పాలిటిక్స్‌లో 3 కోర్సులు చేశారు
*1935లో ఆర్బీఐ ఏర్పాటులో కీలకపాత్ర
*అంబేడ్కర్ పర్సనల్ లైబ్రరీలో 50వేల పుస్తకాలు ఉండేవి
*దేశంలో పనిగంటలను రోజుకు 14 గం. నుంచి 8 గం.కు తగ్గించారు
>ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి
News December 6, 2025
నితీశ్ కొడుకు రాజకీయాల్లోకి రావొచ్చు: JDU నేత

బిహార్ CM నితీశ్‌కుమార్ తనయుడు నిశాంత్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. JDU జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. “పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. నిర్ణయం మాత్రం ఆయనదే” అని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో నిశాంత్ పోటీ చేయకపోయినా కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


